Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'హుషారు' ఫేమ్ అభినవ్ మేడిశెట్టి, రమ్య పసుపులేటి జంటగా తెరకెక్కిన చిత్రం 'మైల్స్ ఆఫ్ లవ్'. నందన్ దర్శకుడు. రాజారెడ్డి నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న చిత్రమిది. కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో కార్తికేయ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'ట్రైలర్స్ పాటలు చాలా బాగున్నాయి. ధ్రువన్ మంచి సంగీతం అందించారు. నిర్మాతకు ఇది మొదటి సినిమా అయినా నందన్ లాంటి మంచి దర్శకుడుతో ఈ చిత్రాన్ని చాలా చక్కగా నిర్మించాడు. ఈ నెల 29న వస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను' అని అన్నారు.
చిత్ర నిర్మాత రాజారెడ్డి మాట్లాడుతూ,'మా దర్శకుడు నందన్ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని అందరికీ నచ్చే విధంగా తెరకెక్కించాడు. రవిమణి కెమెరా విజువల్స్ సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయి. రెగ్యులర్ కమర్షియల్‌గా కాకుండా చేసిన ఈ సినిమా క్లీన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందరూ కచ్చితంగా ఈ సినిమాని ఎంజారు చేస్తారు' అని అన్నారు. 'ఈ సినిమాను ప్రెజెంట్ యూత్‌కి నచ్చే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రోమ్ కామ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించాం' అని దర్శకుడు నందన్ తెలిపారు. విస్మయశ్రీ, రవితేజ, సురేందర్, ప్రియ తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు.