Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా నటించిన చిత్రం 'అసలేం జరిగింది?'. ఎన్వీఆర్ దర్శకుడు. ఎక్సోడస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల ఈ సినిమా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబందం మంగళవారం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుకను నిర్వహించింది.
ఈ సందర్భంగా హీరో శ్రీరామ్ మాట్లాడుతూ,'దర్శకుడు చెప్పిన కథతోపాటు లిమిటెడ్ బడ్జెట్లో నిజాయితీగా సినిమా చేస్తామని నిర్మాతలు ఇచ్చిన మాట నాకెంతో నచ్చింది. ఎంతో క్రమశిక్షణ, తపనతో, మంచి నాణ్యతతో ఈ సినిమాని పూర్తి చేశారు. చక్కటి పదాలతో వాసు అర్థవంతమైన సంభాషణలు రాశారు. పెద్ద సినిమాల వల్ల చిన్న చిత్రాలకు స్క్రీన్స్ దొరకడం లేదు. ఆ పోరాటం ఎప్పుడూ ఉంటుంది. కష్టపడి సాధించిన విజయంలో ఎంతో సంతప్తి ఉంటుంది. అలాంటి సక్సెస్‌ను మాకు అందించిన చిత్రమిది. కొత్తవాళ్లను ప్రోత్సహించే కింగ్ జాన్సన్ లాంటి నిర్మాతలు ఇండిస్టీలోకి రావాలి. మంచి పాటలున్న సినిమాని చాలా రోజుల తర్వాత చేయడం ఆనందంగా అనిపించింది' అని తెలిపారు.
'ఎక్సోడస్ మీడియా పతాకంపై మేం నిర్మించిన తొలి సినిమా ఇది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా, పరిమిత బడ్జెట్లో సినిమాని తెరకెక్కించాం. తెలుగు ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన వచ్చింది. పాజిటివ్ టాక్ బాగా ఉండటంతో వసూళ్లు కూడా బాగున్నాయి. ఊహించని విజయమిది' అని నిర్మాత కింగ్ జాన్సన్ కొయ్యడ అన్నారు. దర్శకుడు ఎన్వీఆర్ మాట్లాడుతూ, 'ఈ సక్సెస్ క్రెడిట్ నిర్మాత జాన్సన్‌కు దక్కుతుంది. సినిమా హిట్ అవుతుందని నమ్మిన తొలి వ్యక్తి హీరో శ్రీరామ్. నన్ను, నా కథను నమ్మి అండగా నిలిచారు' అని చెప్పారు.