Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుదేవా, అదాశర్మ, నిక్కిగల్రాని హీరో, హీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం 'చార్లీ చాప్లిన్'. శక్తి చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ తారకరామ పిక్చర్స్ పతాకంపై ఎమ్.వి.కష్ణ సమర్పణలో 'మిస్టర్ ప్రేమికుడు'గా
అందిస్తున్నారు. వి.శ్రీనివాసరావు, గుర్రం మహేష్ చౌదరి నిర్మాతలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 29న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఫిలించాంబర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత గుర్రం మహేష్ చౌదరి మాట్లాడుతూ,'ఎక్కడా రాజీ పడకుండా తెలుగు స్ట్రయిట్ సినిమాలా డబ్బింగ్ చేయించాం. పాటలు అద్భుతంగా వచ్చాయి. తమిళంతో ఈ సినిమా పెద్ద సక్సెస్ అయింది. తెలుగులో కూడా అదే స్థాయిలో ఆడుతుందన్న నమ్మకం ఉంది' అని చెప్పారు.
'ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలోని పాటలతో పాటు సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలవనున్నాయి. ప్రభుదేవ నటన, డాన్స్‌తో పాటు అదాశర్మ, నిక్కిగల్రాని అందం, అభినయం సినిమాకు హైలెట్. ప్రభుదేవా మార్క్ హాస్యంతో, డాన్స్‌తో మరోసారి తెరపై కనువిందు చేయబోతుంది' అని మరో నిర్మాత వి.శ్రీనివాసరావు అన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రసన్నకుమార్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత ముత్యాల రాందాస్, 'బాక్సాఫీస్' అధినేత రమేష్ చందు, డిస్ట్రిబ్యూటర్ గోపాల్ పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.