Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగ శౌర్య , రీతూ వర్మ జంటగా నూతన దర్శకురాలు లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నటించిన చిత్రం 'వరుడు కావలెను'. సితార ఎంటర్టైన్మైంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న థియేటర్లలో విడులవుతోంది. ఈ సందర్భంగా సినిమాలో కథానాయిక రీతూ వర్మ మంగళవారం మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
అరుదుగా వచ్చే పాత్ర..
దర్శకురాలు లక్ష్మీ సౌజన్య చెప్పిన కథ బాగా నచ్చేసింది. ఇందులో 'భూమి' క్యారెక్టర్ నన్ను బాగా ఎట్రాక్ట్ చేసింది. ఫీమేల్ లీడ్‌కి ఛాలెంజింగ్ రోల్స్ చాలా రేర్‌గా వస్తుంటాయి. అలాంటి అరుదైన క్యారెక్టర్‌తో నేను చేసిన సినిమా ఇది. ఇప్పటి వరకూ నేను చేసిన క్యారెక్టర్స్‌కి, దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. సినిమా చూశాక 'భూమి' క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది. కచ్చితంగా ఈ పాత్రలో ప్రేక్షకుల్ని అలరిస్తా. ఈ సినిమా తర్వాత మా డైరెక్టర్‌కి మంచి పేరు వస్తుంది.
స్వచ్ఛమైన ప్రేమకథ..
టీజర్, ట్రైలర్ చూసి ఇది ఫీమేల్ సెంట్రిక్ మూవీ అనుకుంటున్నారు. కానీ ఇది ఫీమేల్ సెంట్రిక్ కాదు. ఒక స్వచ్ఛమైన ప్రేమకథ. మంచి ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్, మళ్ళీ మళ్ళీ వినేలా సాంగ్స్ ఉంటాయి. సినిమా చాలా ఆహ్లాదకరంగా, హాయిగా ఉంటుంది.
మ్యాజిక్ పెయిర్ అంటున్నారు..
నాగశౌర్య, నాది మ్యాజిక్ పెయిర్ అని అంటున్నారు. ముఖ్యంగా ఇలాంటి లవ్ స్టోరీకి పెయిర్ బాగా సెట్ అవ్వాలి. అప్పుడే సినిమా ఇంకా బాగా రీచ్ అవుతుంది. మా పెయిర్ బాగుందని చాలా మంది చెప్తున్నారు. సో... రిలీజ్‌కి ముందే సగం రిజల్ట్ వచ్చేసినట్టే (నవ్వుతూ). పైగా మామధ్య సాగే రొమాన్స్. ఓల్డ్ స్కూల్ రొమాన్స్ కావడంతో మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది.
పండగలా ఫీలవుతున్నా..
సినిమా రిలీజ్‌కి ముందు ఎవరికైనా నర్వస్నెస్ ఉంటుంది. నాకు కూడా ఉంది. కానీ ఈ ఫేజ్‌ని ఒక ఫెస్టివల్‌లా ఫీలవుతూ, ఎంజారు చేస్తున్నాను. రిలీజ్‌కి ముందే ఇండిస్టీలో కూడా సినిమా బాగుంది అనే పాజిటివ్ టాక్ వచ్చింది. అది విని ఎంతో సంతోషంగా ఉంటున్నా. మా ప్రొడ్యూసర్స్‌కి మంచి సక్సెస్ రావాలి.
దానికి.. చాలా టైం ఉంది
నా పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది. ప్రస్తుతం శర్వానంద్‌తో తెలుగు, తమిళంలో ఓ బైలింగ్వెల్ సినిమా చేస్తున్నా. అలాగే తమిళంలోమరో సినిమాతో పాటు ఓ వెబ్ సిరిస్‌లోనూ నటిస్తున్నాను.