Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకాష్ పూరి, కేతిక శర్మ జంటగా నటించిన చిత్రం 'రొమాంటిక్'.
పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిల్ పాదురి దర్శకుడు. ఈ సినిమా ఈనెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హీరో ఆకాష్ పూరి మీడియాతో సంభాషించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
ఈ సినిమాలో వాస్కోడిగామా పాత్రలో కనిపిస్తాను. వాడి రూటే రాంగ్ రూట్. క్రైమ్ డిపార్ట్మెంట్లో ఉంటాడు. నాన్న (పూరిజగన్నాథ్)గారి సినిమాల్లో చంటిగాడు, పండుగాడు, బుజ్జగాడు అనే పాత్రలు ఎలా గుర్తుండిపోయాయో, వాస్కోడిగామా పాత్ర కూడా అందరికీ గుర్తుండిపోతుంది.
చిన్నప్పటి నుంచి హీరోలందరూ మా నాన్న డైలాగ్స్ చెబుతుంటే ఆనందపడేవాడిని. ఇప్పుడు నేను ఆయన డైలాగ్స్ చెప్పటం సంతోషంగా అనిపించింది.
ఈ సినిమాలో ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లుంటాయి. ఎమోషనల్ కంటెంటూ ఉంటుంది. ఇది కేవలం యూత్ సినిమా మాత్రమే కాదు. ఫ్యామిలీ అంతా చూసే సినిమా. ఈ సినిమా చూసి నాన్న గారితో పాటు అందరూ ఎమోషనల్ అయ్యాం. చాలా బాగా వచ్చింది. రేపు సినిమా చూశాక అందరూ అదే ఫీలవుతారు. దర్శకుడు అనిల్‌గారికి ఈ సినిమాతో కచ్చితంగా మంచి పేరు వస్తుంది.
రమ్యకష్ణ గారితో పని చేయడమే పెద్ద ఛాలెంజింగ్. ఆమెతో పని చేయడం గౌరవంగా ఫీలవుతున్నాను. ఆమెకు, నాకు వచ్చే సీన్లు పోటాపోటీగా ఉంటాయి. నువ్వా నేనా? అన్నట్టుగా ఉంటాయి. ప్రభాస్ గారికి నేనంటే చాలా ఇష్టం. టీజర్ చూసి పదేళ్ల అనుభవం ఉన్న నటుడిలా చేశావ్ అంటూ ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు. అలాంటి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది.
మా నాన్న సక్సెస్‌ని నేను ఎంతగా ఎంజారు చేస్తున్నానో, నా సక్సెస్‌ను కూడా ఆయన అంతే ఎంజారు చేయాలి. ఆ విజయం ఈ సినిమాతో వస్తుందా?, లేకపోతే వేరే ఏ సినిమాతోనైనా వస్తుందా? అని కాదు. నేను సక్సెస్ కొట్టాలి. మా నాన్న కాలర్ ఎగరేయాలి. ఆయన ఎంజారు చేయాలి.
నేను హీరోగా నిలబడ్డ తర్వాతే డైరెక్షన్ చేస్తా. కథ రాయడం నాకు రాదు. మా నాన్నకు రెమ్యూనరేషన్ ఇచ్చి, కథ తీసుకుని, డైరెక్షన్ చేస్తాను. రజనీకాంత్, చిరంజీవి నాకు దేవుళ్లతో సమానం. వారి సినిమాలు ఎక్కువగా చూస్తాను. ప్రస్తుతం నేను ఏదో ఒక్క జోనర్‌కే పరిమితం కావాలని అనుకోవడం లేదు.
'చోర్ బజార్' సినిమా చాలా బాగా వస్తోంది. అందులో కూడా 'బచ్చన్ సాబ్' అనే సాలిడ్ క్యారెక్టర్ చేశా. కెరీర్ ప్రారంభంలోనే మంచి పాత్రలు దక్కడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాని కూడా గ్రాండ్ స్కేల్లో చేస్తున్నాం.