Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆనంద్ దేవరకొండ నటించిన నూతన చిత్రం 'పుష్పక విమానం'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఆంధ్రా, సీడెడ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, నైజాంలో గ్లోబల్ సినిమాస్ రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్లో ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలింస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన కంటెంట్ మా సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. అలాగే రిలీజ్ చేసిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఈ నెల 30న ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నారు. దీంతోపాటు హీరో విజరు దేవరకొండ ఈ సినిమాకు చేస్తున్న ప్రమోషన్‌తో ఆడియెన్స్‌కు ఈ సినిమా మరింతగా రీచ్ అవుతోంది. ఈ సినిమాని నూతన దర్శకుడు దామోదర అత్యద్భుతంగా తెరకెక్కించారు. హీరో విజరు దేవరకొండ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని 'కింగ్ అఫ్ ది హిల్' ఎంటర్ టైన్మెంట్స్, టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి' అని తెలిపింది. ఆనంద్ దేవరకొండ, శాన్వి మేఘనా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అనురాగ్ పర్వతనేని, సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్, ఆర్ట్ డైరెక్టర్ : నీల్ సెబాస్టియన్, ఎడిటర్ : రవితేజ గిరిజాల, మ్యూజిక్: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని, కాస్టూమ్స్ : భరత్ గాంధీ, నిర్మాతలు: గోవర్ధన్ రావు దేవరకొండ, విజరు మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లి, రచన-దర్శకత్వం: దామోదర.