Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిఎల్ఎన్ మీడియా పతాకంపై నిర్మితమైన చిత్రం 'పాయిజన్'. రమణ, షఫీ, కమల్, అమిత్ విక్రమ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలోని 'మ్యాడ్..' అంటూ సాగే పల్లవిగల పాటను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఇందులోని 'మ్యాడ్..' సాంగ్ సూపర్‌గా ఉంది. చాలా ట్రెండీగా, యూత్‌ఫుల్‌గా పిక్చరైజ్ చేశారు. డెఫినెట్‌గా ఈ సాంగ్ చాలా పెద్ద హిట్ అవుతుంది.మ్యూజిక్ చాలా క్యాచీగా ఉంది. నాకు తమ్ముడి కంటే ఎక్కువైన హీరో రమణకు ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలి' అని తెలిపారు. 'ఈ మూవీని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఒకేసారి విడుదల చేస్తున్నాం. మా నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా డిఫరెంట్ లొకేషన్లలో చాలా రిచ్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు. కథానుగుణంగా ముంబై, పూణే, లోనావాలా, హైదరాబాద్ వంటి డిఫరెంట్ సిటీల్లోని, డిఫరెంట్ లొకేషన్లలో భారీగా చిత్రీకరించాం' అని దర్శకుడు రవిచంద్రన్ అన్నారు. హీరో రమణ మాట్లాడుతూ, 'మ్యూజిక్ డైరెక్టర్ నిహారి ఈ 'మ్యాడ్..' సాంగ్ కోనం జర్మనీ నుంచి ఏబూల్టన్ మ్యూజిక్‌ను ఇంపోర్ట్ చేశారు. అద్భుతంగా వచ్చిన ఈ పాటను మా అన్నయ్య శ్రీకాంత్ విడుదల చేయటం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం' అని తెలిపారు. సిమ్రాన్, శివన్య, సారిక, అర్చన, ప్రతీక్ష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సిరాజ్, నిర్మాత : శిల్పిక. కె