Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకాష్ పూరి, కేతిక శర్మ జంటగా నటించిన చిత్రం 'రొమాంటిక్'. పూరి కనెక్ట్స్,
పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా
ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిల్ పాదురి దర్శకుడు. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం నాయిక కేతిక శర్మ మీడియాతో మాట్లాడుతూ, 'నేను ఢిల్లీ నుండి వచ్చాను. మాది డాక్టర్స్ ఫ్యామిలీ. అయితే నేను మాత్రం సినిమా రంగాన్ని ఎంచుకున్నాను. ఓ రోజు సడన్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మిమ్మల్ని చూశాం. మీరొకసారి ఆడిషన్‌కి రండి అని.. పూరి కనెక్ట్స్ నుంచి కాల్ వచ్చింది. ఆడిషన్లో ఎంపికై, హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా. అందుకే ఈ సినిమా నాకు చాలా చాలా స్పెషల్. ఈ క్షణాన్ని ఎంజారు చేయాలనుకునే అమ్మాయి మోనిక పాత్రలో కనిపిస్తాను. సమాజంలో కట్టుబాట్ల గురించి ఆలోచించకుండా, తనకు నచ్చినట్టుగా బతికే అమ్మాయి కారెక్టర్ నాది. ఎవరినైనా ప్రేమిస్తే, మనస్ఫూర్తిగా ప్రేమించడం మాత్రమే తెలుసు. నాకు పూర్తిభిన్నమైన పాత్ర ఆకాష్‌ది. ప్రేమ అంటే నమ్మడు. మా మధ్య జరిగిన సంఘటనల సమాహారమే ఈ సినిమా. హీరోయిన్‌గానే కాకుండా సింగర్‌గానూ తొలి సినిమాతోనే ఛాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. నేను పాడిన 'నా వల్లే కాదే..' పాట చాలా బాగుందని పూరిసార్ మెచ్చుకున్నారు. రమ్యకష్ణ, ఆకాష్‌తో కలిసి నటించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. దర్శకుడు అనిల్ ప్రతీదీ క్లియర్‌గా చెప్పి, చేయించుకున్నారు. ఈ సినిమా టోటల్ అవుట్‌ఫుట్ చూశాక, ఆడియెన్స్‌కు నేను నచ్చుతానని అనిపించింది. అలాగే సినిమా కూడా బ్లాక్‌బస్టర్ అవుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నా. ఫుల్ మాస్ థియేటర్ మూవీ. పక్కా పూరిగారి సినిమాలా ఉంటుంది. ఈ సినిమా విడుదల కాకముందే నాగశౌర్యతో 'లక్ష్య', వైష్ణవ్ తేజ్‌తో మరో సినిమాని చేసే
ఛాన్స్ రావడం అదృష్టంగా భావిస్తున్నా' అని తెలిపింది.