Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం 'భోళా శంకర్'. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 11న ఉదయం 7:45 గంటలకు ప్రారంభం కానుంది. నవంబర్ 15 నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని మేకర్స్ బుధవారం అధికారికంగా తెలిపారు. 'అన్నాచెల్లెళ్ల బంధం చుట్టు తిరిగే ఈ కథలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. చిరంజీవి సరసన నటించే కథానాయిక పేరుని అతి త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. టైటిల్ పోస్టర్‌కు ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ ఆకట్టుకుంది. వచ్చే ఏడాది విడుదలయ్యే ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్ భాగస్వామ్యంతో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర చాలా గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియనున్నాయి' అని చిత్ర బృందం పేర్కొంది.