Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విమర్శకుల చేత ప్రశంసలు పొందిన 'హార్మోన్స్' చిత్ర నిర్మాత, గిరిజన సంక్షేమ సమితి వ్యవస్థాపకులు, ఎస్.సి., ఎస్.టి విజిలెన్స్ కమిటీ సభ్యులు నూనా వత్ సారయ్య నాయక్ గుండెపోటుతో హైదరా బాద్‌లో మరణించారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. సామాజిక కథాంశంతో డా.ఆనంద్ రచన - దర్శకత్వంలో 2012లో 'హార్మోన్స్' అనే చిత్రాన్ని నిర్మించగా, అప్పట్లో చిరంజీవి, డా.డి.రామానాయుడు, డి.టి.నాయక్ తదితరుల ప్రశంసలు పొందింది. తదుపరి డా.ఆనంద్ దర్శకత్వంలోనే బాలికా విద్య, మానవ హక్కులు, మహిళా సాధికారత కథాంశంగా 'ప్రజా హక్కు', 'అంటరానితనం', 'చిరు తేజ్‌సింగ్' వంటి లఘు చిత్రాలను నిర్మించి, అభిరుచి కలిగిన నిర్మాతానూ పేరొందారు. ప్రముఖ బాలనటులు అవంతికా వందనపు, హాసిని అన్విను ఈయనే పరిచయం చేశారు. నాయక్ మతి పట్ల దర్శకులు, సామాజిక కార్యకర్త డా.ఆనంద్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, ఆయన సేవలతోపాటు ఆయనతో తనకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటిపర్యంతమయ్యారు.