Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు హీరోలుగా క్రిష్టెన్ రవళి, అపర్ణ హీరోయిన్లుగా నటించిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'తీరం'. అఖి క్రియేటివ్స్ వర్క్స్, యల్.యస్.ప్రొడక్షన్స్ బ్యానర్లు పై అనిల్ ఇనమడుగు దర్శకత్వంలో నిర్మాత యం.శ్రీనివాసులు నిర్మించిన చిత్రమిది. ఈ సినిమా నేడు (శుక్రవారం) అత్యధిక ధియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఈ చిత్ర థియేట్రికల్ యాక్షన్ ట్రైలర్‌ని నిర్మాత శ్రీనివాసులు రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా హీరో, డైరెక్టర్ అనిల్ ఇనమడుగు మాట్లాడుతూ, 'ఎంతో కష్టపడి మా టీమ్ అందరం కలిసి ఓ మంచి సినిమా చేశాం. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా రియాలిస్టిక్‌గా, టెక్నికల్ ఎక్వీప్‌మెంట్స్ ఏమీ వాడకుండా చాలా నేచురల్‌గా సినిమా చేశాం. ఈ క్రమంలో మా నిర్మాత శ్రీనివాస్ ఇచ్చిన సపోర్ట్ మరువలేనిది. ఆయన వల్లే సినిమా కంప్లీట్ చేసి, రిలీజ్ చేయగలుగు తున్నాం. అలాగే సినేటెరియా వెంకట్‌గారు థియేటర్స్ అన్ని మాట్లాడి సెట్ చేస్తున్నారు.. ఆయనకి స్పెషల్ థ్యాంక్స్. ఈ సినిమా తర్వాత ఇందులో నటించిన ప్రతి ఆర్టిస్ట్‌కీ గొప్ప పేరొస్తుంది. అందరం కలిసి ఒక దమ్మున్న సినిమా చేశాం. ప్రేక్షకులకు గ్యారెంటీగా నచ్చుతుంది' అని తెలిపారు.