Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అబ్రార్‌ఖాన్, ఐశ్వర్య జంటగా రాజారెడ్డి పానుగంటి దర్శకత్వంలో ఏ.ఎం. ఖాన్ నిర్మిస్తున్న చిత్రం 'ఓ మధు'. బేబీ ఆస్కా సమర్పణలో మ్యాక్ కింగ్ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ సునీత లక్ష్మారెడ్డి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'ట్రైలర్ చాలా బాగుంది. మా ముందు పుట్టి పెరిగిన అబ్బాయి ఈ రోజు హీరోగా ఎదగడం చాలా సంతోషంగా ఉంది. తల్లి కోరిక తన కొడుకు డాక్టర్ కావాలని, తండ్రి కోరిక యాక్టర్ అవ్వాలని అందుకే మా హీరో డాక్టర్‌గా, యాక్టర్‌గా రాణించి తల్లిదండ్రులు కోరికలను నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. నేడు (శుక్రవారం) విడుదల అవుతున్న ఈ సినిమా దర్శక, నిర్మాతలకు పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని చెప్పారు.
'దర్శకుడు మంచి కంటెంట్‌తో ఈ సినిమాను అద్బుతంగా తీశాడు. సంగీత దర్శకుడు మంచి పాటలు అందించారు. సినిమా చాలా బాగా వచ్చింది. నేడు (శుక్రవారం) విడుదలవుతున్న ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను' అని నిర్మాత ఏ.ఎం ఖాన్ అన్నారు. దర్శకుడు రాజారెడ్డి పానుగంటి మాట్లాడుతూ,'ఈ సినిమాను నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇంత మంచి సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు' అని తెలిపారు. 'ఇది హర్రర్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ. ఈ సినిమా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది' అని సహ నిర్మాత వాజిద్ అన్నారు. హీరో అబ్రార్ ఖాన్ మాట్లాడుతూ, 'వినూత్న కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది' అని చెప్పారు.