Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంతోష్ శోభన్, మెహరీన్ నాయకానాయికలుగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మంచి రోజులు వచ్చాయి'. యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. వి. సెల్యూలాయిడ్ ఎస్కెఎన్ నిర్మాత. దీపావళి కానుకగా ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు అనూప్‌రూబెన్స్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ,'లాక్డౌన్లో దర్శకుడు మారుతిగారు ఈ కథ చెప్పారు. చాలా తక్కువ రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేస్తామని, ఇందులో సంగీతం చాలా పాజిటివ్‌గా ఉండాలని చెప్పారు. ఒక కాలనీలో జరిగే కథ. ప్రతి మనిషీ ఏదో ఒక భయంతో బాధపడుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో సాగే కథ ఇది. ఇదొక ఫీల్‌గుడ్ సినిమా. ఇలాంటి కథలకి సంగీతం అందించడం అంత ఈజీ కాదు. కథని ప్రేక్షకులు ఇంటికి క్యారీ చేసే మ్యూజిక్ ఇవ్వాలి. లక్కీగా ఆ మ్యాజిక్ ఈ సినిమా విషయంలో జరిగింది. పాటలన్ని ఇప్పటికే మంచి హిట్ అయ్యాయి. మ్యూజిక్ విషయంలో స్వేచ్ఛ ఇచ్చిన దరక్శ, నిర్మాతలు మారుతి, ఎస్‌కెఎన్‌కి థ్యాంక్స్' అని చెప్పారు.