Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకాష్ పూరి, కేతిక శర్మ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'రొమాంటిక్' ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదల కాబోతోంది. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిల్ పాదురి దర్శకుడు.
సినిమా విడుదల సందర్భంగా గురువారం మీడియాతో సమావేశంలో దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ, 'ఇంటెన్స్ లవ్ స్టోరీ సినిమా చూసి చాలా రోజులైంది. సినిమా చాలా బాగుంది. మూడేళ్ల తరువాత థియేటర్లో సినిమా చూడటం చాలా బాగుంది. ప్రేమ కన్నా మోహం చాలా గొప్పది. మోహం నుంచే ప్రేమ పుడుతుంది. ప్రేమలో ఉన్నా కూడా వాళ్ళిద్దరూ మోహమే అని అనుకుంటారు. ఈ సినిమాకు అదే ఫ్రెష్‌గా ఉంటుంది. ఆకాష్ మంచి నటుడు అని రాజమౌళి కూడా చెప్పారు. సినిమా చూసిన చాలా మంది ఎమోషనల్ అయ్యారు. థియేటర్ కాకపోతే ఏడ్చేవాళ్లమని చాలా మంది చెప్పారు. ముందే ఎడిటింగ్ రూంలో చూసినప్పుడు నాకు కూడా ఏడుపు వచ్చింది. ఇది 'ఇడియట్' లాంటి సినిమా అని అందరూ అన్నారు. ఆకాష్ మంచి నటుడే. కానీ రొమాన్స్‌లో వీక్. ఇంకా బాగా చేస్తాను అంటే ఇంకా బాగా రాస్తాను. వాడు నన్ను సరిగ్గా వాడుకోవడం లేదు. ఇలాంటి తండ్రి అందరికీ దొరకడు. ఈ చిత్రాన్ని యంగ్ జనరేషన్ తీస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే అనిల్‌కు ఇచ్చాను. కథను ఎంతో ప్రేమిస్తే తప్ప, అలాంటి ఎమోషన్‌ను క్యారీ చేసేలా తీయలేం. అనిల్ బాగా తీశాడు. దర్శకులందరూ వచ్చి ఈ చిత్రాన్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. ఇదొక మంచి వాతావరణాన్ని క్రియేట్ అయ్యేలా చేస్తుంది. రామ్ గోపాల్ వర్మ గారు కూడా సినిమా చూస్తే బాగుండేది. మళ్లీ నా మీద షాంపైన్ పోసేవారు. నటుడిగా ఆకాష్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాడు. ఇది పెద్ద హీరో కథ. కానీ ఆకాష్ బాగా హౌల్డ్ చేశాడు. బయట సినిమాలు చేయనివ్వు.. కొంచెం పేరు వచ్చాక. మనం చేద్దామని ఆకాష్ అన్నాడు. సినిమా విడుదలవుతుందని తెలిసి, ప్రభాస్ ఫోన్ చేశాడు. డార్లింగ్ మనం ఏం చేద్దాం?, ఎలా ప్రమోట్ చేద్దామని అన్నారు. ఇక విజరు దేవరకొండ కూడా వరంగల్‌లో ఫంక్షన్ పెడదామని అని అడిగాడు. వారిద్దరూ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లారు' అని చెప్పారు. దర్శకుడు అనిల్ పాదురి మాట్లాడుతూ, 'ఆకాష్ వయస్సుకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని తీయడమే నాకు పెద్ద ఛాలెంజ్' అని చెప్పారు.