Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రజనీకాంత్ హీరోగా యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం 'పెద్దన్న'. ఈ చిత్రంలోని 'రా సామీ' అంటూ సాగే లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ, 'పూర్తిగా మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసిన ఈ పాటలో రజనీ పాత్రను చూపించిన విధానం అద్భుతం. డి.ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ పాట ఫుల్ జోష్‌తో ఉంది. ముఖేష్, ఆయన టీమ్ అత్యద్భుతంగా ఆలపించారు. కాసర్ల శ్యామ్ తన స్టైల్లో మాస్ యాంగిల్లో ఈ పాటను రాశారు. టాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి ఏసియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్పి సంస్థ 'అన్నాత్తె' డబ్బింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో నారాయణదాస్ నారంగ్, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని నవంబర్ 4న భారీగా విడుదల చేస్తున్నారు. రజనీకాంత్ చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమాలో నయనతార, కుష్బూ, మీనా, ప్రకాష్ రాజ్, జగపతి బాబు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. దర్శకుడు శివ తెరకెక్కించిన దీనికి వెట్రి సినిమాటోగ్రాఫర్‌గా, రూబెన్ ఎడిటర్‌గా చేస్తున్నారు' అని చెప్పారు.
సర్జరీ సక్సెస్
గురువారం తీవ్రమైన తలనొప్పితో రజనీకాంత్ చెన్నై అల్వార్ పేటలోని కావేరీ హాస్పిటల్లో చేరిన విషయం విదితమే. నిపుణులైన డాక్టర్ల బృందం ఆయన్ని పరీక్ష చేసి, మెదడుకి రక్తాన్ని సరఫరా చేసే ఓ రక్తనాళంలో అడ్డంకులు ఉన్నట్లుగా నిర్ధారించారు. దీనికి సంబం ధించిన సర్జరీ శుక్రవారం విజయ వంతంగా ముగిసింది. ప్రస్తుతం ఆయనకు ఎటువంటి ఇబ్బందీ లేదు. చక్కగా కోలుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లో ఆయన హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవు తారు. రజనీ ఆరోగ్య విషయంలో అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ తెలిపారు. తమ అభిమాన కథానాయకుడి సర్జరీ సక్సెస్ కావడంతోపాటు ఆయన బాగా కోలుకుంటున్నారనే వార్త అభిమానులకే కాకుండా తమిళ చిత్ర వర్గాలకూ ఊరటనిచ్చింది.