Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అప్పూ అని ఆప్యాయంగా అందరూ పిలుచుకునే పునీత్ రాజ్కుమార్కి తెలుగు చిత్రసీమతో మంచి అనుబంధం ఉంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'అప్పూ' చిత్రం ఘన విజయం సాధించి, థియేటర్లలో ఏకంగా 200 రోజులు ఆడింది. హీరోగా పరిచయం అవుతూ తొలి సినిమా దక్కించుకున్న సక్సెస్‌తో 'అప్పూ'గా పునీత్ అభిమానగణాన్ని సొంతం చేసుకున్నారు. ఇదే సినిమాను రవితేజతో 'ఇడియట్'గా పూరి తెరకెక్కించి, బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. అలాగే ఎన్టీఆర్‌తో పూరి రూపొందించిన 'ఆంధ్రావాలా' సినిమాను, కన్నడలో పునీత్‌తో మెహర్‌రమేష్ 'వీరకన్నడీగ' పేరుతో తెరకెక్కించి హిట్టు అందుకున్నారు. అలాగే పునీత్‌తో దర్శకుడు వీరశంకర్ 'నమ్మ బసవ' చిత్రాన్ని రూపొందించారు. దీన్ని వీరశంకరే నిర్మించటం విశేషం. అలాగే ఎన్టీఆర్ పాటలను ఎంతో ఇష్టపడిన పునీత్ తన 'చక్రవ్యూహ' సినిమాలో 'గెలియా గెలియా..' అంటూ సాగే పాటను ఎన్టీఆర్‌తో పాడించారు. తమన్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు విశేష శ్రోతకాదరణ లభించింది.