Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మైక్రో మూవీ మేకర్స్ బ్యానర్ పై రచయిత, నిర్మాత రవి కంటు నిర్మించిన చిత్రం 'రేవ్ పార్టీ'. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని యువ హీరో మంచు విష్ణు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'దర్శకుడు చెప్పిన లైన్ విన్న తర్వాత, ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఏర్పడింది' అని చెప్పారు. 'ఈ సినిమా చూశాను. చూస్తున్నంత సేపూ నెక్స్ట్ మినిట్‌లో ఏం జరుగుతుందో అని ఊహించని రీతిలో చాలా అద్భుతంగా ఉంది' అని నటుడు శివ బాలాజీ అన్నారు. మరో హీరో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ, 'ఈ చిత్ర కథ విన్న తర్వాత, ఈ కథతో నేను సినిమా చేస్తే బాగుణ్ణు అనిపించింది' అని తెలిపారు. నిర్మాత, రచయిత రవి కంటు మాట్లాడుతూ, 'ఇదొక హర్రర్ సినిమా. ప్రతి నిమిషం ఉత్కంఠభరితంగా సాగుతూ ఆడియన్స్‌కు నచ్చుతుంది' అని చెప్పారు. 'ఒక్క సెకన్ కూడా బోర్ కొట్టకుండా, చాలా క్యూరియాసిటీగా సాగే సినిమా ఇది. అలాగే సందేశాత్మక చిత్రం కూడా ' అని దర్శకుడు శివ కుమార్ అన్నారు. హీరోలు రవి, రఘు దీపక్ మాట్లాడుతూ, 'ఇది మాకు మొదటి చిత్రమైనా ఎంతో ఉత్సాహంతో సెట్లో వర్క్ చేశాం. ఎంతో నేర్చుకున్నాం. ఇలాంటి సబ్జెక్టుకు ఎంచుకున్నందుకు నిర్మాత రవి గారికి థ్యాంక్స్' అని తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు : కోటి, ఎడిటర్ : జాఫర్.