Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా నిర్మించిన చిత్రం 'వరుడు కావలెను'. ఈ చిత్రంతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమయ్యారు. నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన ఈ సినిమా శుక్రవారం రిలీజై, అన్ని చోట్లా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, 'వరుడు కావలెను' తో ఒక క్లీన్ మూవీ చేశాం. థియేటర్లకు వచ్చి ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. సినిమా విడుదలైన అన్ని సెంటర్స్ నుంచి సూపర్ హిట్ టాక్ వస్తోంది. సినిమా బాగుందనే మౌత్ టాక్‌తో ప్రతి షోకు థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరుగుతోంది. ఒక కొత్త డైరక్టర్ని తీసుకొచ్చి, మా సంస్థకు హిట్ ఇచ్చినందుకు హీరో నాగశౌర్యకు కృతజ్ఞతలు' అని చెప్పారు.
'ప్రేక్షకులు ఇచ్చిన విజయానికి థ్యాంక్స్. ఈ సినిమాని సక్సెస్ చేసి నా మీద అందరూ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నా. మేము కథలో అనుకున్న భావోద్వేగాలు స్క్రీన్ మీద పండాయి. సకుటుంబంగా థియేటర్లకు వస్తూ మా చిత్రానికి ప్రేక్షకులు ఘన విజయాన్ని అందించారు' అని దర్శకురాలు లక్ష్మీ సౌజన్య అన్నారు. హీరో నాగశౌర్య మాట్లాడుతూ, 'ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని మొదటి నుంచీ బలంగా నమ్మాను. ఇవాళ మా నమ్మకం నిజమైంది. ఈ చిత్రాన్ని చూసి ఆదరించిన ప్రేక్షకులకు, చూడబోయే ప్రేక్షకులకు కూడా థ్యాంక్స్ చెబుతున్నా. థియేటర్లకు వచ్చిన ఫ్యామిలీ ఆడియెన్స్‌కు సినిమా బాగా నచ్చింది. ఈ చిత్రంతో ప్రేక్షకులకు ఇంకా దగ్గరైనందుకు సంతోషంగా ఉంది' అని తెలిపారు.
ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తూ చిత్ర బందం మౌనం పాటించింది.