Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అప్పూ.. అని ముద్దుగా పిలుచుకునే తమ అభిమాన కథానాయకుడు పునీత్ రాజ్‌కుమార్ ఇకలేరనే వాస్తవాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. తిరిగిరాని లోకాలకు పయనించాడని కన్నీరుమున్నీరయ్యారు. తమ హీరోని కడసారి చూసేందుకు తరలి వచ్చిన లక్షలాది అభిమానుల బాధాతప్త హృదయాలకు, కన్నీళ్ళకు, ఆక్రందనలకు కంఠీరవ స్టేడియం సాక్ష్యంగా నిలిచింది. రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకున్న పునీత్ ఆకస్మిక మరణం అభిమానుల్నే కాదు అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం పునీత్ భౌతికకాయానికి నివాళ్ళర్పిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆయనతో తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. పునీత్ అంత్యక్రియలు ఆదివారం ఉదయం కర్నాటక ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరుగనున్నాయి.