Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని తాజాగా నటిస్తున్న చిత్రం 'శ్యామ్ సింగరారు'. నిహారిక ఎంటర్టైన్మెంట్స్పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ సంకత్యాన్ దర్శకుడు. నవంబర్ 6న ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'ఫస్ట్‌లుక్ పోస్టర్లతోనే సినిమా మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అన్ని వర్గాల నుంచి సినిమా మీద పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. కలకత్తా బ్యాక్్డ్రాప్లో రూపొందుతున్న ఈ చిత్రంలో నాని గతంలో ఎన్నడూ పోషించని పాత్రల్లో కనిపించనున్నారు. నాని కెరీర్లోనే ది బెస్ట్ అనేలా ఈ సినిమా ఉండబోతోందని మేకింగ్ విజువల్స్ చూస్తేనే తెలుస్తుంది. 'రైజ్ ఆఫ్ శ్యామ్' అంటూ విడుదల చేసిన లిరికల్ వీడియో ప్రోమో అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. నవంబర్ 6న ఫస్ట్ సింగిల్‌ని రిలీజ్ చేస్తున్నారు. శ్యామ్ పాత్రకు సంబంధించిన కారెక్టరైజేషన్ గురించి వివరిస్తూ ఈ పాట సాగుతుంది. ఈ నేపథ్యంలో విడుదల చేసిన నాని పోస్టర్ అందరిలోనూ క్యూరియాసిటీని రైజ్ చేస్తోంది. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఆడియో ప్రమోషన్స్ ప్రారంభించేందుకు ఇదే పర్ఫెక్ట్ సాంగ్ అని వేరే చెప్పక్కర్లేదు. సాయి పల్లవి, కతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథ అందించారు. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత కతి మహేష్, ప్రతిభా వంతుడైన యశ్ మాస్టర్ ఈ చిత్రంలోని పాటలకు కొరియోగ్రఫర్లుగా నృత్యరీతుల్ని సమకూరుస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అన్ని రకాల ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. భారీ స్థాయిలో వీఎఫెఎక్స్‌తో రాబోతున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది' అని తెలిపారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం, జిషు సేన్ గుప్తా, లీలా సామ్సన్, మనీష్ వద్వా, బరున్ చందా తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్.వెంకట్ రత్నం (వెంకట్), ఎడిటర్ :నవీన్ నూలి, ఫైట్స్ : రవి వర్మ.