Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తికేయ హీరోగా శ్రీ సరిపల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆదిరెడ్డి.టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మించిన సినిమా 'రాజా విక్రమార్క'. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. దీపావళి కానుకగా సోమవారం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు ఆదిరెడ్డి.టి మాట్లాడుతూ, 'మాది తూర్పు గోదావరి జిల్లాలోని రాయవరం మండలంలో గల వెదురుపాక గ్రామం. ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ గారిది మా ఊరే. సినిమాల్లోకి రాకముందు నుంచే నేను, రామారెడ్డి మంచి స్నేహితులం. పంపిణీదారుడిగా నేను ఉత్తరాంధ్రలో 'బాద్ షా', 'గబ్బర్ సింగ్', 'గ్యాంబ్లర్' తదితర సినిమాలు చేశా. శ్రీకాంత్‌గారు నటించిన 'రంగా... ది దొంగ' నిర్మాతగా నా తొలి చిత్రం. నిర్మాతగా ఇది నా రెండో సినిమా. కరోనా రెండు దశలను దాటుకుని మా సినిమా ఇంత బాగా వచ్చిందంటే దానికి కారణం కార్తికేయ. మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. కార్తికేయ ఇప్పటివరకూ చేసిన సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా మరో ఎత్తు. సినిమా విడుదలైన తర్వాత కార్తికేయ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. ఈ సినిమాని ఆంధ్రాలో కొన్ని ఏరియాలు అమ్మేశాం. కొన్ని ఏరియాలు మా దగ్గరే ఉన్నాయి. వాటికి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి' అని చెప్పారు.
నిర్మాత '88' రామారెడ్డి మాట్లాడుతూ, 'మాది తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలు మండలంలో గల కొంకుదురు గ్రామం. ఎస్వీ కష్ణారెడ్డిగారు మా ఊరివాసులే. సినిమాల కంటే ముందు నేను ఆదిరెడ్డి కలిసి వ్యాపారం చేశాం. డిస్ట్రిబ్యూటర్ వినోద్ రెడ్డిగారి ద్వారా ఈ కథ నా దగ్గరకు వచ్చింది. మా ఆదిరెడ్డిగారికి చెప్పాను. ఇద్దరికీ నచ్చడంతో సినిమా ప్రారంభించాం. నిర్మాతగా ఇది నా తొలి సినిమా. మా దర్శకుడు శ్రీ సరిపల్లి హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేశాడు. ఆ అనుభవంతో మన తెలుగు ప్రేక్షకుల అభిరుచిని దష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేశాడు. మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయకముందు నుంచీ మంచి బజ్ నెలకొంది. హిందీ రైట్స్‌ను 3.25 కోట్లకు కొనుగోలు చేశారు. తమిళ ప్రేక్షకుల నుండి ఫస్ట్ లుక్, టీజర్‌కు అద్భుత స్పందన లభిస్తోంది. టీజర్ విడుదలైన తర్వాత టాప్ క్లాస్ అని చెబుతున్నారంతా. టీజర్, టైలర్ మాత్రమే కాదు... సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు ఉంటుంది. న్యూ ఏజ్ స్టయిలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమా మీద మాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే, నైజాం ఏరియాలో సొంతంగా మేమే విడుదల చేస్తున్నాం. కార్తికేయ కెరీర్లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. అన్నీ కుదిరితే ఈ సినిమా సక్సెస్ మీట్లో కొత్త సినిమా ప్రకటిస్తాం' అని తెలిపారు.c