Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం 'మంచి రోజులు వచ్చాయి'. మారుతి దర్శకుడు. ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మెహరీన్ మీడియాతో మాట్లాడుతూ, 'ఇదొక కాలనీలో జరిగే కథ. ఇలాంటి కథలు ప్రతి ఇంట్లో జరుగుతుంటాయి. ఈ సినిమాలో మేం చూపించే సన్నివేశాలు, పరిస్థితులు కోవిడ్ టైంలో చాలా మందికి జరిగాయి. నేను చేసిన 'ఎఫ్2', 'ఎఫ్3' సినిమాల్లో చేసిన పాత్రలకంటే ఇందులో చేసిన పాత్ర చాలా డిఫరెంట్. ఈ సినిమాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పద్దు క్యారెక్టర్లో నటించా. మారుతిగారి స్టైల్లో ఈ సినిమా ఫుల్ ఎంటర్టైన్మైంట్ జోనర్లో ఉంటుంది. సంతోష్ చాలా బాగా నటించాడు. 'మహానటి'లో చేసిన కీర్తి సురేష్ క్యారెక్టర్, 'ఓ బేబీ' సినిమాలో సమంత చేసిన క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. ఇలాంటి క్యారెక్టర్స్ వస్తే చేస్తా. కన్నడలో శివరాజ్ కుమార్తో ఒక సినిమా చేస్తున్నాను. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి' అని తెలిపారు.