Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్ తరుణ్, శ్రీను గవిరెడ్డి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'అనుభవించు రాజా'. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆదివారం మీడియాతో నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ, 'ఈ చిత్రాన్ని ఈనెల 26న విడుదల చేస్తున్నాం. సినిమా చాలా బాగా నచ్చింది. రెండు గంటలు సినిమా చూసి అందరూ నవ్వుకునేలా ఉంటుంది' అని తెలిపారు. 'కమర్షియల్, కామెడీ నేపథ్యంలో రాబోతోంది. ఓ భీమవరం కుర్రాడు.. వాడి లైఫ్‌లో జరిగే ఇన్సిడెంట్ల నేపథ్యంతో తెరకెక్కించాం. రాజ్ తరుణ్ బయట చాలా సైలెంట్‌గా ఉంటాడు. కానీ తెరపై చాలా బాగా నటించాడు. కశిష్ ఖాన్ చాలా బాగా నటించింది' అని డైరెక్టర్ శ్రీను గవిరెడ్డి అన్నారు. 'ఈ సినిమా కోసం నాతో డ్యాన్సులు చేయించటానికి కష్టపడ్డ విజరు మాస్టర్‌కు, ఫైట్లు చేయించేందుకు కష్టపడ్డ సతీష్ మాస్టర్‌కు థ్యాంక్స్. మా చిత్రాన్ని దయచేసి థియేటర్లోనే చూడండి' అని హీరో రాజ్ తరుణ్ చెప్పారు. 'సినిమా తప్పకుండా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది' అని మరో నిర్మాత సునీల్ నారంగ్ తెలిపారు.