Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రజనీకాంత్ హీరోగా రూపొందిన 'పెద్దన్న' సినిమా దీపావళి కానుకగా ఈనెల 4న రాబోతోంది. ఏసియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్పి సంస్థ, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం మీడియాతో నిర్మాత నారాయణ్ దాస్ నారంగ్ మాట్లాడుతూ, 'మా మీద ఉన్న నమ్మకంతో 'పెద్దన్న' చిత్రాన్ని విడుదల చేసేందుకు అవకాశం ఇచ్చిన సన్ టీవీ వారికి, రజనీకాంత్‌కు ధన్యవాదాలు. సినిమా సూపర్ హిట్ అవుతుంది. ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న రజనీకాంత్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు.
మరో నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ,'ఈ సినిమా 'అన్నాత్తె'కు డబ్బింగ్గా రాబోతోంది. మనం ఎలా అయితే రజనీకాంత్‌ను చూడాలని అనుంటామో అలానే దర్శకుడు శివ చూపించారు. ఇందులో అన్నాచెల్లెళ్ల బంధం అద్భుతంగా ఉంది. ఫుల్ మీల్స్ లాంటి సినిమా. క్లాస్, మాస్, ఫ్యామిలీ అందరూ థియేటర్‌కు వచ్చి చూసే సినిమా' అని తెలిపారు.