Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం 'పుష్పక విమానం'. గీత్ సైని, శాన్వి మేఘన నాయికలుగా, నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హీరో విజరు దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీని కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్స్, టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలు. ఈనెల 12న థియేటర్లలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను చిత్ర బృందం వైభవంగా నిర్వహించింది. ట్రైలర్‌ను అగ్ర కథానాయకుడు అల్లుఅర్జున్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'పుష్ప ఫర్ పుష్పరాజ్ ..ఈ టైటిల్, ఈ కాన్సెప్ట్, ఈ కార్యక్రమం అదిరింది. ట్రైలర్ చూశాక ఈ సినిమా మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. సినిమా విజయవంతం అవుతుందనే వైబ్స్ తెలుస్తున్నాయి. అందుకే ఈ టీమ్‌కు ఆల్ ద బెస్ట్ కాకుండా అడ్వాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నాను. విజరు దేవరకొండ సెల్ఫ్ మేడ్ యాక్టర్. అతని ఎదుగుదల నా విజయం అనుకుంటాను' అని చెప్పారు.
నిర్మాత విజయ్ మట్టపల్లి మాట్లాడుతూ, 'ఈ సినిమా మంచి కాన్సెప్ట్‌తో చేశాం. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది' అని తెలిపారు. 'ఇదొక కామెడీ థ్రిల్లర్. ఈ చిత్రంలో చిట్టిలంక సుందర్‌గా ఆనంద్ దేవరకొండ నవ్విస్తాడు, ఏడిపిస్తాడు. అందర్నీ ఎంటర్టైన్ చేసే సినిమా ఇది' అని దర్శకుడు దామోదర తెలిపారు. హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, 'ఈ సినిమాలో చిట్టిలంక సుందర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్. వచ్చే జీతంలో సగం దాచుకుని, పెళ్లి చేసుకుంటాడు. హనీమూన్‌కు వెళ్ళాలని, హాయిగా లైఫ్‌లో సెటిల్ అవ్వాలని అనుకునే టైమ్‌లో భార్య లేచిపోతుంది. అయితే చిట్టిలంక సుందర్ భార్య దొరికిందా లేదా అనేది ఈనెల12న థియేటర్లలో చూద్దాం' అని చెప్పారు.
'ఈ కథలో హీరో క్యారెక్టర్‌కు చాలా కష్టాలుంటాయి. ఆ కష్టాలకు మనకు నవ్వొస్తాయి. సునీల్ క్యారెక్టర్ ఈ సినిమాకు ఓ పిల్లర్. గీత్ సైని, శాన్వి మేఘనా సూపర్బ్‌గా నటించారు. బన్నీ అన్న ట్రైలర్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ఆయన వర్క్ చూసి ఇన్స్పైర్ అవుతుంటా' అని విజయ్ దేవరకొండ తెలిపారు.