Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాల్, ఆర్య కాంబినేషన్లో రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'ఎనిమి'. ఆనంద్ శంకర్ దర్శకుడు. మిని స్టుడియోస్ బ్యానర్‌పై ఎస్. వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా ఈనెల 4న గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు ఆనంద్ శంకర్ మాట్లాడుతూ,'ఇదొక కమర్షియల్ సినిమా. ఆర్.డి.రాజశేఖర్ విజువల్స్ గొప్పగా చూపించారు. మీ అందరికి నచ్చుతుంది' అని అన్నారు. 'ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. టైటిల్‌కి తగ్గట్టే ఈ సినిమాకి చాలా మంది ఎనిమిలు ఉన్నారు. అయినప్పటికీ ఎంతో కష్టపడి ఈ సినిమాని పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం' అని నిర్మాత వినోద్ తెలిపారు.
హీరో ఆర్య మాట్లాడుతూ,'ఈ సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చినందుకు విశాల్‌కు థ్యాంక్స్. మంచి స్టోరి లైన్, ఎమోషన్స్ ఉన్నాయి. స్నేహితులు ఎనిమిలుగా మారితే ఎలా ఉంటుంది..?, ఫిజికల్ పవర్ మాత్రమే కాకుండా మైండ్ గేమ్ కూడా ఉంటుంది. 'వాడు వీడు' తర్వాత మరోసారి విశాల్‌తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది' అని చెప్పారు.
హీరో విశాల్ మాట్లాడుతూ,'నిర్మాత వినోద్‌కు థ్యాంక్స్. ఎందుకంటే తను లేకపోతే ఈ సినిమా లేదు. ఈ సినిమాకి ఓటీటీకి నుంచి మంచి ప్రాఫిట్‌తో ఆఫర్ వచ్చింది. కానీ ఆయన సినిమాను థియేటర్ విడుదల చేయలని అనుకున్నాడు. ఆనంద్ శంకర్‌తో ఫస్ట్ టైమ్ ట్రావెల్ అయ్యాను. కథ చెప్పినప్పుడు.. ఆర్య చేస్తే బాగుంటుందని, ఆ క్యారెక్టర్ ఇంకొంచెం పెంచితే బాగుటుందని అన్నాను. తమన్ సాంగ్స్ ఇప్పటికే బాగా హిట్ అయ్యాయి' అని తెలిపారు.
పునీత్ మేం నిన్ను చాలా మిస్ అవుతున్నాం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. పునీత్ కేవలం మంచి నటుడే కాదు.. గొప్ప మనిషి. ఒక మనిషి ఇన్ని సహాయ కార్యక్రమాలు చేయగలరా? అని అనిపించింది. ఓ ప్రభుత్వం చేయాల్సిన పనిని ఆయన చేశారు. 1800 మంది పిల్లలను చదివిస్తున్నారు. ఆయన స్నేహితుడిగా నేను ఆ 1800 మంది పిల్లల చదువు బాధ్యతను తీసుకుంటాను. వారికి అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను.
- విశాల్