Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి నటిస్తున్న 153వ చిత్రం 'గాడ్‌ఫాదర్'. మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ సోమవారం నుంచి హైదరాబాద్‌లో ఆరంభమైంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలిపారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'ఈ చిత్రానికి 'గాడ్ ఫాదర్' అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేయటంతో అందరిలోనూ అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అలాగే చిరంజీవి బర్త్ డే సందర్బంగా రిలీజ్ చేసిన టైటిల్ మోషన్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో చిరంజీవి కనిపించబోతోన్నారు. మెగాస్టార్ సినిమా అంటే అభిమానులకు ఎలాంటి అంచనాలుంటాయో తెలిసిన దర్శకుడిగా మోహన్ రాజా ఈ చిత్రాన్ని అద్భుతమైన పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. అలాగే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఒరిజినల్ వర్షెన్‌కి కొన్ని మార్పులు కూడా చేశారు. ఈ సినిమా షూటింగ్ గత నెలలో హైదరాబాద్‌లోనే ప్రారంభమైంది. చిరు మీద అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ సోమవారం రోజు మొదలైంది. ఈ షెడ్యూల్లో చిరంజీవి, ఇతర ముఖ్య తారాగణం మీద కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు' అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం : ఎస్ఎస్ తమన్, సినిమాటోగ్రాఫర్ : నీరవ్ షా, ఆర్ట్ డైరెక్టర్ : సురేష్ సెల్వరాఘవన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వాకాడ అప్పారావు, స్క్రీన్ ప్లే - దర్శకత్వం : మోహన్ రాజా.