Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకుడు రాజమౌళి మేకింగ్ గురించి వేరే చెప్పక్కర్లేదు. అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకుల్ని ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేయటంలో దిట్ట. దీపావళికి సర్ప్రైజ్గా విడుదల చేసిన 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్‌లో కూడా రాజమౌళి అత్యద్భుతమైన విజువల్స్‌తో మరోసారి అందర్నీ ఫిదా చేశారు. కేవలం 45 సెకన్ల నిడివిగల ఈ గ్లింప్స్‌లోని ప్రతి సందర్భం, ప్రతి లొకేషన్, నటీనటుల నటన, హావభావాలు అన్నింటికిమించి మేకింగ్‌లో భారీతనం.. వెరసి ఆసాంతం అద్భుతం అనేలా ఉండటం విశేషం. దీంతో 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్ సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్'. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య డీవీవీ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దీపావళి పండగ కానుకగా చిత్ర బృందం 45 సెకండ్ల నిడివిగల గ్లింప్స్‌ని సోమవారం రిలీజ్ చేసింది. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, నాయికలు అలియాభట్, ఒలివియా మోరీస్, అజరుదేవగన్..ఇలా సినిమాలోని ముఖ్య పాత్రధారుల్ని, వారి నేపథ్యాల్ని, భారీ సెట్టింగుల్ని.. చూపిస్తూ ఈ గ్లింప్స్ సాగి, సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది.