Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కవితా కౌశిక్, అన్వేషి జైన్, మనీష్ గోప్లానీ, అర్చన వేద్నేకర్, వేదిక, భండారి, కబీర్ సదానంద్
- ప్రముఖ హిందీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ `హంగామా ప్లే` లో
న్యూఢిల్లీ: హిందీ ఒరిజినల్ షో గా ప్రముఖ హిందీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ `హంగామా ప్లే`లో ప్రసారితమవుతున్న ఛలవలో ప్రముఖ నటీనటులు కవితా కౌశిక్, అన్వేషి జైన్, మనీష్ గోప్లానియండ్, అర్చన వేద్నేకర్, వేదిక భండారి, కబీర్ సదానంద్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు, వీరితో పాటు సందీప ధర్, సమీక్షా భట్నాగర్, ఆభాస్ మెహతా, అమిత్ బెహ్ల్, హిందీ ఒరిజినల్ షోలో ధీరాజ్ తో తదితరులు నటించారు. ప్రేమ, ద్రోహం, రహస్యం అనే మూడు ప్రధానాంశాల చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులకు సస్పెన్స్ అనుభూతి కల్పించనున్న చలవ 5 ప్రత్యేక కథనాల సమాహారం. ప్రజలు తమ నైతికత హద్దులు దాటి వారు అర్హులైన వాటిని పొందడం ప్రధాన కంథాంశంగా చెప్పవచ్చు.
SAB TV లో ప్రసారితమైన సిట్కామ్ F.I.R like లో చంద్రముఖి చౌతాలా పాత్రతో అందరి మన్ననలు పొందిన ప్రసిద్ధ నటి కవితా కౌశిక్ చలవలో మరో ప్రత్యేక పాత్ర ధరించడం విశేషం. ఛలవ షోలో ఆమె నటించిన పాత్ర గురించి అడిగినప్పుడు, “ఈ షో అనిశ్చితి, ప్రేమ, మోసం, మరణం అనే భావనను కలిపిస్తుంది” అని కవిత అభిప్రాయపడ్డారు. ఆమె ఇంకా మాట్లాడుతూ, “నటిగా ఎదగడానికి, పాత్రను రూపొందించడానికి అవసరమైన మార్పులను గ్రహించడానికి ఒక స్థలాన్ని సృష్టించిన గౌరి పాత్ర చాలా ఆకర్షణీయంగా ఉంది.” అని చెప్పారు. హూ ఈస్ యువర్ డాడీ వంటి మరపు రాని పాత్రలతో ప్రసిద్ది చెందిన అన్వేషి జైన్ తన ఆలోచనలను పంచుకుంది. “ఛలవలోని పాత్ర నాకు చాలా అవసరమైన ప్రేరణను అందించింది. ఈ పాత్ర పోషించడానికి స్పష్టమైన అవగాహన అవసరమైంది. ఈ షో నా నటనా నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, నటిగా సరికొత్త మార్గాలను అన్వేషించడానికి సరైన మార్గాన్ని చూపింది అని చెప్పగలను. ఏ నటికైనా అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే వారు పోషించే పాత్రకు న్యాయం చేసే క్రమంలో ఎదురయ్యే ప్రతి సవాలును ఎదుర్కొనే విధానం. రెహనైన్ అనే నా పాత్ర నాలోని నటికి తృప్తి కలిగించే పాత్ర అని చెప్తాను.``
తాప్కీప్యార్ కీలో బిహాన్ పాండే, ఆర్యన్ ఖన్నా పాత్రలకు ప్రసిద్ధి చెందిన మనీష్ గోప్లానీ మాట్లాడుతూ “పాత్ర అభివృద్ధిలో మానసికంగా పెట్టుబడి పెట్టడం, పాత్ర ఉద్దేశ్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం, దాని గొప్పతనాన్ని సాధించడానికి ఒక నటుడు చేయగలిగినంత చేయడం. ఇటువంటి పాత్రలు పోషించే అవకాశం ఒక్కసారే అని భావిస్తున్నాను. జీవితకాలంలో నా అర్హతల మేరకు, ఛలవలో నేను పోషించిన ఈ పాత్ర టాప్. చలవ షోలో నటించి నా పాత్రకు న్యాయం చేయడం నా అదృష్టం. నా పాత్ర పేరు అర్మాన్."
రాగిణి MMS రిటర్న్స్‌లో తన పాత్రలకు ప్రసిద్ధి చెందిన అర్చన వేద్నేకర్ ఛలవలో తన పాత్ర గురించి మాట్లాడుతూ “నేను నటించిన విధానంపై ఎప్పుడూ అనుమానాలు ఉండేవి. డైలాగ్‌లు అందించిన విధానం, అది వీక్షకులను ఎలా ప్రభావితం చేసింది అనే అంశాలు వెంటాడుతూండేవి. ఈ ఆలోచనలే ఛలవలో నా పాత్రకు ముడిసరుకుగా మారాయి. ఈ షోలో నటించిన నటీనటులందరికీ తమ కల సాకారం అవుతుంది. షో వీక్షకుల హృదయాల్లో చెప్పుకోదగ్గ స్థానాన్ని ఇస్తుందని నేను భావిస్తున్నాను. పాత్రకు తగ్గట్టుగా భావోద్వేగాలను పెంపొందించుకోవాలనే ఆలోచన రాధికకు ఎప్పుడూ సాహసమే. నటిగా నా నైపుణ్యాలను, సామర్థ్యాలను మెరుగుపరచుకోవడానికి నన్ను ప్రేరేపించే అంశం ఇదే”. అని అన్నారు.
డ్రీమ్ గర్ల్, ఇండోరిఇష్క్ వంటి పాపులర్ షోలతో తనదైన ముద్ర వేసిన వేదిక భండారి మాట్లాడుతూ “ఇది ఇతర షో లాంటిది కాదు. చలవ నిజమైన భావోద్వేగాలతో వ్యవహరిస్తుంది. అన్నిషేడ్స్ ఉన్న పాత్రలను చూపిస్తుంది. నేను మొదట స్క్రిప్ట్‌ను చదివినప్పుడు, షో యొక్క విభిన్న విధానానికి నేను ఆకర్షితురాలినయ్యాను. వెంటనే పాత్రకు ఓకే చెప్పాను. నా పాత్రలోని నటి తన జీవితాన్ని శాశ్వతంగా మార్చగలిగే సమస్యను ఎదుర్కొంటుంది. సత్వరమే తన సమస్యకు చాలా అసాధారణమైన పరిష్కారాన్ని పొందుతుంది. ఛలవ వంటి షో వీక్షకులకు జీవిత వాస్తవికతను కళ్లకు కడుతుంది.`` అని వివరించారు.
నటన, దర్శకత్వ విభాగాలలో సుపరిచితులైన కబీర్ సదానంద్ విషయానికి వస్తే అతను ఫగ్లీ , పాప్‌కార్న్ ఖావో వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. రెహ్నా హై తేరేదిల్ మే లో మస్త్ హో జావో అనే చెప్పుకోదగ్గ పాత్రలు పోషించారు. అతను దర్శకత్వం వహించిన చిత్రం, కెమెరా ముందు 5000 గంటల పాటు నటుడిగా, దర్శకుడిగా అతని పని తనాన్ని చాటి చెప్పింది. అంతర్జాతీయంగా భారతదేశంలో అవార్డులను గెలుచుకునేలా చేసింది. అతని నట/దర్శకత్వ ప్రతిభ గురించి పలుకరించినప్పుడు ఎన్నో విషయాలు పంచుకున్నారు. “నటుడిగా, దర్శకుడిగా నన్ను నిలబెట్టే వైవిధ్యమైన వ్యవస్థను రూపొందించడానికి చిత్రంలో ఏమి అవసరమో వాటిని పూర్తిగా నమ్మి చేస్తాను. రెండు విభాగాలలో పని చేయడంలో ఇబ్బందులు ఎదురైనా, నేను పోషించాల్సని పాత్రపైనే పూర్తి దృష్టి కేంద్రీకరిస్తాను. ఇందుకు అంకితభావం అవసరం. ఎందుకంటే కథాంశం అసాధారణమైన కథతో నడుస్తుంది. విశ్వసనీయత, ఒక నటుడి యొక్క ప్రత్యేకత. దీనిని స్వీకరించడానికి, దానిలోని సారాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి, వీక్షకులకు చిరస్మరణీయమైన అనుభూతిని సృష్టించడానికి ఇష్టపడటంపై ఆధారపడి ఉంటుందని నేను నమ్ముతున్నాను. మరోవైపు దర్శకుడు తాను దర్శకత్వం వహించబోయే అంశంపై గణనీయమైన అవగాహనాకలిగి ఉండాలి.``