Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుహాస్ హీరోగా నటించిన నూతన సినిమా 'ఫ్యామిలీ డ్రామా'. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో తేజా కాసరపుతో కలిసి మెహెర్ తేజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తేజ కాసరపు, పూజా కిరణ్, అనూష నూతుల, శ్రుతి మెహర్, సంజరు రథా కీలక పాత్రలు పోషించారు. సోని లివ్ ఓటీటీలో గత నెల 29వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. డార్క్ కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చడం సంతోషంగా ఉందంటున్నారు హీరో సుహాస్, దర్శకుడు మెహెర్ తేజ్. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో మంగళవారం పాత్రికేయులతో తమ సంతోషాన్ని షేర్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు మెహెర్ తేజ్ మాట్లాడుతూ,'రామ్ గోపాల్ వర్మ, హిచ్ కాక్ లాంటి దర్శకులు నన్ను ఇన్స్పైర్ చేశారు. వాళ్ల సినిమాల తరహా స్క్రీన్‌ప్లే స్ఫూర్తితో డార్క్ కామెడీ జోనర్లో ఈ చిత్రాన్ని రూపొందించాను. సినిమా చేసేప్పుడు ఇది ఒక టైప్ ఆఫ్ ఆడియెన్స్‌కు మాత్రమే నచ్చుతుందని అనుకున్నాం. కానీ ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా మా చిత్రాన్ని చూస్తుండటం, ఆదరిస్తుండటం సంతోషంగా ఉంది. సుహాస్ చక్కగా నటించాడు. అందరూ మా చిత్రాన్ని ఆదరించి, మంచి విజయాన్ని అందించారు' అని తెలిపారు.
'ఈ సినిమా సక్సెస్ అవడం చాలా సంతోషంగా ఉంది. వాస్తవంగా ఈ సినిమాకు, నా క్యారెక్టరైజేషన్‌కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని భయపడ్డా. కామెంట్స్ చదవడానికి కూడా భయమేసింది. కానీ మొత్తంగా మా చిత్రాన్ని ఆడియెన్స్ రిసీవ్ చేసుకున్నారు. నటుడిగా నాకు కొత్త అనుభూతిని ఇచ్చింది. కుటుంబ ప్రేక్షకులు కూడా చూస్తున్నారంటే సర్ ప్రైజింగ్‌గా, సంతోషంగా ఉంది. ప్రస్తుతం 'రైటర్ పద్మ భూషణ్', 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' చిత్రాల్లో నటిస్తున్నాను. వీటితోపాటు మరో చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి' అని హీరో సుహాస్ అన్నారు.