Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'భీమ్లా నాయక్'. సాగర్. కె చంద్ర దర్శకుడు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే- సంభాషణలు అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్ల కోసం అటు పవర్‌స్టార్ అభిమానులు, ఇటు రానా అభిమానులు ఎదురు చూస్తున్నారు.
వాళ్ళిద్దరి అభిమానుల కోసం దీపావళి కానుకగా ఓ బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చేందుకు చిత్ర బృందం రంగం సిద్ధం చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ, 'బద్దలయ్యే బ్లాస్టింగ్ అప్డేట్ రెడీ అయ్యింది. అదేంటో తెలుసుకోవాలంటే నేటి (బుధవారం) ఉదయం 11 గంటల వరకు వెయిట్ చేయండి' అంటూ చిత్రయూనిట్ ప్రకటించింది. నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. 'ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీది ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. కచ్చితంగా మరో బ్లాక్ బాస్టర్ ఖాయం' అని చిత్ర బృందం పేర్కొంది.