Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకష్ణ నటించిన 'అఖండ' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దీపావళి కానుకగా 'సాంగ్ టీజర్ రోర్' పేరుతో ఓ వీడియోని విడుదల చేయబోతున్నారు. అలాగే పండగ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి విడుదల తేదీని కూడా ఎనౌన్స్ చేయబోతున్నట్టు సమాచారం.
'బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా అనగానే అటు బాలయ్య అభిమానుల్లోను, ఇటు సినీ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉంటాయి. 'సింహా', 'లెజెండ్' వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అందరిలోనూ అమితాసక్తి నెలకొని ఉంది. అలాగే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్ విశేషంగా ఆకట్టుకుని, సినిమాకి మరింత హైప్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా బాలయ్య చెప్పిన డైలాగులకు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అలాగే దీపావళి కానుకగా అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఉంది ' అని చిత్ర బృందం తెలిపింది. 'అఖండ' తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేయబోతున్నారు. ఆహా ఓటీటీ కోసం 'అన్‌స్టాపబుల్స్' షోని బాలకృష్ణ చేస్తున్నారు.
ఆపరేషన్ సక్సెస్
బాలకృష్ణ భుజానికి సంబంధించి మంగళవారం నిర్వహించిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. గత ఆరు నెలలుగా బాలకృష్ణ భుజం నొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆయన డాక్టర్లను సంప్రదించగా, శస్త్ర చికిత్స అవసరమని సూచించారు. వారి సూచన మేరకు బాలకృష్ణ మంగళవారం భుజానికి ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రఘువీర్‌రెడ్డి, డాక్టర్ బి.ఎన్.ప్రసాద్‌ల బందం నాలుగు గంటల పాటు శ్రమించి విజయవంతంగా శస్త్రచికిత్సను పూర్తి చేశారు. బాలకష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అభిమానులు ఎవ్వరూ ఆందోళన పడొద్దని, బాలకృష్ణని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు పేర్కొన్నారు.