Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్లో సితార ఎంటర్టైన్మెంట్స్పై తెరకెక్కుతున్న చిత్రం 'భీమ్లా నాయక్'. దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే- సంభాషణలు అందిస్తుండగా, సాగర్. కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 7న ఈ చిత్రంలోని 'లాలా భీమ్లా..' అంటూ సాగే పాట విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ ఓ ప్రచార చిత్రాన్ని, డైలాగ్తో ఉన్న వీడియో ప్రోమోను విడుదల చేసింది.
'నాగరాజు గారు..హార్టీ కంగ్రాట్స్ లేషన్స్ అండి. మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసింది. హ్యాపీ దీపావళి' అంటూ కథానాయకుడు పవన్ కళ్యాణ్ మందు బాటిల్ ఎత్తి, ఎవరినో ఉద్దేశించి అంటున్న తీరు అందర్నీ అలరిస్తోంది. అలాగే ప్రోమో చివరిలో 'లాలా భీమ్లా' పాట ఈనెల 7న విడుదల అనే ప్రకటన కూడా కనిపిస్తుంది. దీంతో 'లాలా.. భీమ్లా' సాంగ్ సందడికి సిద్ధమైందని వేరే చెప్పక్కర్లేదు. 'గీత రచయిత రామజోగయ్య శాస్త్రి రాసిన 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్, అలాగే విజయదశమి పర్వదినాన విడుదలై 'అంత ఇష్టమేందయ' పాట ప్రేక్షకులను, సంగీత ప్రియులను ఉర్రూతలూగించాయి. వీటికి ముందు పవన్ కళ్యాణ్, రానా ప్రచార చిత్రాలు కూడా సామాజిక మాధ్యమాల వేదికగా సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. ఈ చిత్రాన్ని మా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది' అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. నిత్య మీనన్, సంయుక్త మీనన్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: పి.డి.వి. ప్రసాద్.