Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న నూతన కథానాయిక తాన్యా రవిచంద్రన్. 'రాజా విక్రమార్క' సినిమాలో కార్తికేయకు జంటగా నటించారు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి.టి సమర్పణలో '88' రామారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం మీడియాతో నాయిక తాన్యా రవిచంద్రన్ ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
మాది సినీ నేపథ్యమున్న కుటుంబమే. మా తాతయ్యగారు రవి చంద్రన్ సీనియర్ హీరో. తాతయ్యలో అంకితభావం, క్రమశిక్షణ ఎక్కువ. వ్యక్తిగతంగా నేను ఆ లక్షణాలు అలవర్చుకున్నా. చిన్నతనం నుంచి నాకు సినిమాలు అంటే ఆసక్తి. అయితే మా పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉండటంతో మా తాతయ్యకు కూడా ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు తాతయ్య ఉండుంటే నేను చాలా హ్యాపీగా ఫీలయ్యేదాన్ని. చెన్నైలో పీజీ చేస్తున్న సమయంలో తమిళ పరిశ్రమ నుంచి కొన్ని అవకాశాలు వచ్చాయి. 'ముందు పీజీ పూర్తి చెరు. తర్వాత సినిమాలు చేయొచ్చు' అని మా పేరెంట్స్ చెప్పారు. ఒక్క సినిమా చేస్తానని చెప్పాను. అయితే, వరుస అవకాశాలు రావడంతో తమిళంలో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు చేశా. ఆ మూడు సినిమాలు పూర్తి చేశాక, పీజీ (ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ - హెచ్ఆర్) కంప్లీట్ చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. ఈ సినిమా కోసం దర్శకుడు శ్రీ సరిపల్లి చెన్నై వచ్చి కథ చెప్పారు. కథతో పాటు అందులో నా పాత్ర కూడా బాగా నచ్చింది. కథలో హీరోయిన్ రోల్ చాలా ఇంపార్టెంట్. అందుకని, ఓకే చేశా. ఇందులో నా పాత్ర పేరు కాంతి. కాలేజీకి వెళ్తుంది. అలాగే, భరతనాట్యం డాన్సర్. క్యారెక్టర్ పరంగానూ కాంతి చాలా స్ట్రాంగ్. హౌమ్ మినిస్టర్ కూతురు అయినప్పటికీ... కాంతి చాలా సింపుల్‌గా ఉంటుంది. హీరోయిన్ పాత్రలో లక్షణాలు నాకు బాగా నచ్చాయి. కార్తికేయ ఇందులో ఏజెంట్ రోల్ చేస్తున్నారు. తనది చాలా ఫ్రెండ్లీ నేచర్. అలాగే తన నటన చాలా నేచురల్‌గా ఉంటుంది. అతనితో పాటు సాయికుమార్, తనికెళ్ల భరణితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. ప్రశాంత్ ఆర్. విహారి మంచి సాంగ్స్ ఇచ్చారు. ఇప్పటికే తొలి సాంగ్‌కి రెస్పాన్స్ బాగుంది. నేపథ్య సంగీతం కూడా బాగా చేశారని అందరూ ప్రశంసిస్తున్నారు. మా నిర్మాత '88' రామారెడ్డి, సమర్పకులు ఆదిరెడ్డి ఖర్చుకు వెనుకాడకుండా భారీ స్థాయిలో సినిమా తీశారు. ఈ నెల 12న ఓ మంచి సినిమా చూశామని ప్రేక్షకులు కచ్చితంగా ఫీలవుతారు' అని తెలిపింది.