Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ కూచిపూడి నర్తకి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటిస్తూ, నిశ్రింకళ ఫిల్మ్ పతాకంపై నిర్మించిన చిత్రం 'నాట్యం'. రేవంత్ కోరుకొండ దర్శకుడు. అక్టోబర్ 22న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలనూ సొంతం చేసుకుంది. విశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రం ఈ నెల 20న గోవాలో ప్రారంభం అవుతున్న 52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫీ)లో ప్రదర్శనకు ఎంపికైంది.
ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు రేవంత్ కోరుకొండ మాట్లాడుతూ,''ఇఫీ''ఎంపికైన ఏకైక తెలుగు సినిమాగా 'నాట్యం' నిలవడం గర్వంగా ఉంది. భారతీయ సంస్కతి, తెలుగు గొప్పతనం, అందం గురించి అందరూ మాట్లాడుకోవాలనే లక్ష్యంతో ఈ సినిమా తీశాం. ఆ ఘనతను సాధించామనిపిస్తుంది. త్వరలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయ బోతున్నాం' అని తెలిపారు.
'నాట్యకళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ తెలుగులో వచ్చిన సినిమా ఇది. ఇలాంటి మంచి సినిమాలో భాగం కావడం గర్వంగా ఉంది' అని కమల్ కామరాజు చెప్పారు. 'వ్యాపారాలు, డ్యాన్స్‌ను వదిలిపెట్టి సినిమా చేయడం అవసరమా అని చాలా మంది విమర్శించారు. నేను ఎన్ని సమాధానాలు చెప్పిన వారు సంతప్తిగా ఫీలవ్వలేదు. అలాంటివారందరికి మా సినిమా 'ఇఫీ'కి ఎంపిక కావడమే పెద్ద సమాధానం. తెలుగు నాట్యకళలకు ఈ సినిమా మరింత గుర్తింపును తీసుకొస్తుందని నమ్ముతున్నా' అని నటి, నిర్మాత సంధ్యారాజు అన్నారు. 'విరోధి', 'గతం' తర్వాత ఇండియన్ పనోరమకు ఎంపికైన తెలుగు సినిమాగా 'నాట్యం' నిలిచింది. అలాగే తెలుగులోనూ మంచి సినిమాలు వస్తాయని నిరూపించిందని నిర్మాతలు ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల చెప్పారు.