Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈనెల 20 నుంచి గోవాలో 52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) అంగరంగ వైభవంగా ఆరంభం కానుంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్ పనోరమ విభాగంలో ప్రదర్శితమయ్యే చిత్రాల జాబితాను ఇఫీ జ్యూరీ శనివారం అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ ఫిల్మ్ మేకర్ ఎస్.వి.రాజేంద్ర సింగ్ బాబు అధ్యక్షతన 12 మంది సభ్యుల జ్యూరీ ఈ విభాగం కోసం వచ్చిన 221 చిత్రాల నుంచి 25 ఫీచర్ ఫిల్మ్‌లను, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్‌లను ఎంపిక చేసింది. వీటిల్లో ఈ ఏడాది మన దేశం తరఫున ఉత్తమ విదేశీ విభాగం కోసం ఆస్కార్‌కి ఎంపికైన 'కోజంగల్' (తమిళ)తోపాటు 'నాట్యం' (తెలుగు) ఉన్నాయి. అలాగే బెంగాలీ (ఐదు), కన్నడ (నాలుగు), మలయాళం (ఐదు), హిందీ (రెండు) చిత్రాలు ఎంపికయ్యాయి. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ వర్చ్యుల్గా, భౌతికంగానూ ఈ చలన చిత్రోత్సవాన్ని నిర్వహించబోతున్నారు.