Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కష్ణ, చాణక్య, రేఖా నిరోష, యశ్న చౌదరి, స్వాతి మండల్, చంద్రశేఖర్ తిరుమలశెట్టి, పోసాని కష్ణ మురళి, మిర్చి మాధవి, టిఎన్ఆర్, డిఎస్రావు నటీనటులుగా జాగో స్టూడియో పతాకంపై రూపొందుతున్న చిత్రం 'కటారి కృష్ణ'. ప్రకాష్ తిరుమల శెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ పి.ఏ. నాయుడు, నాగరాజు తిరుమల శెట్టి సంయుక్తంగా నిర్మిస్తున్న రొమాంటిక్, యాక్షన్ థ్రిల్లర్. దీపావళి సందర్భంగా ప్రసాద్ ల్యాబ్‌లో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్‌ను సినీ అతిరథుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మురళీ మోహన్ ట్రైలర్‌ను విడుదల చేయగా, తనికెళ్ల భరణి పాటలను రిలీజ్ చేేశారు.
ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ,'ట్రైలర్ చాలా బాగుంది. రొమాంటిక్ సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించి, చిత్ర యూనిట్‌కు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని అన్నారు. 'యూత్‌కు మెచ్చే విధంగా తీసిన ఈ చిత్ర ట్రైలర్, పాటలు బాగున్నాయి. ఈ చిత్రం మంచి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని తనికెళ్ళ భరణి చెప్పారు.
చిత్ర నిర్మాతలు పి.ఏ.నాయుడు, నాగరాజు తిరుమల శెట్టి మాట్లాడుతూ, 'దర్శకుడు కొత్తవాడైనా తను చెప్పిన కొత్త కాన్సెప్ట్ కథ మాకు బాగా నచ్చింది. వైవిధ్యమైన కథాంశంతో రొమాంటిక్ సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో యాక్షన్, ఛేజింగ్ సీక్వెన్స్‌లు, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. ఈ చిత్రం ప్రేక్షకులందరికీ తప్పక నచ్చుతుంది. నవంబర్ చివరివారంలో మా సినిమాని థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు. 'కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడమే కాకుండా ముఖ్యంగా యూత్‌ని బాగా ఆకట్టుకునే అంశాలతో ఈ చిత్రం రూపొందింది' అని దర్శకుడు ప్రకాష్ తిరుమలశెట్టి చెప్పారు. హీరో కష్ణ మాట్లాడుతూ, 'మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్' అని అన్నారు.