Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకష్ణ ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం 'స్కై లాబ్'. డా.రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. పథ్వీ పిన్నమరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో శనివారం ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను చిత్ర బృందం వైభవంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా నిర్మాత పథ్వీ పిన్నమరాజు మాట్లాడుతూ, 'మా ఫ్యామిలీ ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉండింది. నిర్మాతగా నేను తొలి అడుగులు వేశాను. నిత్యామీనన్ ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సినిమా స్క్రిప్ట్ అలాగే మేకింగ్‌లో డైరెక్టర్ విశ్వక్ ఐడియాలజీ ఎంతగానో నచ్చాయి. సినిమా చాలా బాగా వచ్చింది. డిసెంబర్ 4న సినిమాను విడుదల చేస్తున్నాం' అని చెప్పారు. 'నిత్యామీనన్, సత్యదేవ్, రాహుల్ ముగ్గురూ అద్భుతమైన నటులు. వీరితో పనిచేయడం అదష్టంగా భావిస్తున్నాను. ప్రశాంత్ విహారి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సింక్ సౌండ్‌లో సినిమాను చేశాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం' అని దర్శకుడు విశ్వక్ ఖండేరావు అన్నారు. చిత్ర సమర్పకుడు రవికిరణ్ మాట్లాడుతూ, 'విశ్వక్‌కు స్టోరీపై అద్భుతమైన గ్రిప్ ఉంది. పొలాలు, డబ్బులు ఇవేమీ విలువైనవి కావు. మానవతా విలువలు ముఖ్యమని ఈ సినిమా చివరలో చూపించాం. మా బ్యానర్ గౌరవాన్ని నిలబెట్టే చిత్రమవుతుంది' అని చెప్పారు.
నిత్యామీనన్ మాట్లాడుతూ, 'ఈ సినిమా నాకు చాలా చాలా స్పెషల్. డైరెక్టర్ కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇలాంటి సినిమాలు చేయడమే నా డ్రీమ్. ఈ సినిమా నిర్మాణంలో నేను కూడా భాగమైనందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. విశ్వక్ విజన్‌ను మేం సపోర్ట్ చేశామంతే. తను ట్రూ ఫిల్మ్ మేకర్. హండ్రెడ్ పర్సెంట్ మూవీ సక్సెస్ అవుతుంది' అని అన్నారు. సత్యదేవ్ మాట్లాడుతూ, 'ఈ సినిమాను నెరేట్ చేసేటప్పుడు విశ్వక్ చెప్పిన తీరు, కథను రాసిన తీరు చాలా గొప్పగా ఉంది. ఇదొక గొప్ప సినిమా అవుతుంది. ఆదిత్య విజువల్స్ చూసి పూరీ జగన్నాథ్‌గారు ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. ట్రైలర్లో చూస్తే నాకే నేను కొత్తగా కనిపించాను' అని తెలిపారు.