Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర కథానాయకుడు చిరంజీవి 154వ చిత్రానికి బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మాస్, రగ్డ్ లుక్‌తో ఉన్న చిరుని పోస్టర్ సోషల్ మీడియాలో వైౖరల్ అయింది. అలాగే అరాచకం.. ఆరంభం అంటూ ఈ పోస్టర్ పై ఇచ్చిన క్యాప్షన్ ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియజేస్తోంది.
శనివారం ఈ చిత్ర పూజా కార్యక్రమాలను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. ముహూర్తపు షాట్‌కు అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, పూరి జగన్నాథ్ కెమెరా స్విచాన్ చేశారు. కొరటాల శివ, హరీష్ శంకర్, మెహర్ రమేష్, బుచ్చి బాబు, శివ నిర్వాణ స్క్రిప్ట్‌ను చిత్ర యూనిట్‌కు అందజేశారు. ముహూర్తపు షాట్‌కు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జీకే మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక బందం ఈ చిత్రంలో భాగం కానుంది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, ఆర్థర్ ఏ విల్సన్ కెమెరామెన్‌గా, నిరంజన్ దేవరమనే ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, సుష్మిత కొణిదెల క్యాస్టూమ్ డిజైనర్‌గా బాధ్యతల్ని నిర్వర్తించబోతున్నారు. రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతున్నాయి. ఈ చిత్రానికి కథ, మాటలు బాబీ రాయగా, కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్ ప్లేని, హరి మోహన కష్ణ, వినీత్ పొట్లూరి రచనా సహకారం అందించారు. డిసెంబర్లో ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది.