Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పలు వైవిధ్యమైన చిత్రాల నిర్మాణంతో తెలుగునాట సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. తాజాగా ఈ సంస్థ తొలిసారి ఓ అంతర్జాతీయ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు ఆరంభించింది. 'తామర' టైటిల్‌తో తెరకెక్కబోయే ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు రవి.కె.చంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న 'భీమ్లా నాయక్' చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు.
'తామర' చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ప్రచార చిత్రంలో ఓ అమ్మాయి తల ఓ పక్కకు తిప్పుకుని ఉన్నట్లు కనిపిస్తుంది. ఇండో- ఫ్రెంచ్ కొలాబరేషన్లో నిర్మితమవుతున్న ఈ చిత్ర కథాకథనాలు అత్యంత ఉత్సుకతను కలిగిస్తాయని పోస్టర్ చెప్పకనే చెబుతోంది. సిితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన 'జెర్సీ' చిత్రం జాతీయ పురస్కారం అందుకున్న నేపథ్యంలో ఇప్పుడీ అంతర్జాతీయ చిత్ర నిర్మాణం ప్రకటన అటు ప్రేక్షకుల్లోను, ఇటు సినీ వర్గాల్లోనూ అమితాసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీ నటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత సూర్య దేవర నాగ వంశీ తెలిపారు.