Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి.టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మించిన సినిమా 'రాజా విక్రమార్క'. అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తికేయ సరసన తాన్యా రవిచంద్రన్ కథానాయికగా కనిపించన్నారు. ఈనెల 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి హైదరాబాద్‌లో చిత్ర బృందం వైభవంగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ వేడుకలో బిగ్ టికెట్‌ను హీరోలు సుధీర్ బాబు, శ్రీవిష్ణు, విశ్వక్ సేన్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ, ''రాజా విక్రమార్క' చిరంజీవిగారి టైటిల్. ఈ టైటిల్ దగ్గర నుంచి ఈ సినిమా నాకు చాలా స్పెషల్. దర్శకుడు శ్రీ ఈ కథ చెప్పిన దగ్గర్నుంచి ఈ సినిమా నా సినిమా అన్నట్టు మనసులో ఒక కనెక్షన్ ఏర్పడింది. ఈ సినిమా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. నాకు శ్రీతో మళ్లీ సినిమా చేయాలనుంది. '88' రామారెడ్డి, ఆదిరెడ్డిగారికి థ్యాంక్స్. వాళ్లకు హిట్ ఇచ్చి, సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటాను. నాకు 'గ్యాంగ్ లీడర్', 'చావు కబురు చల్లగా' సినిమాలకు మంచి పేరొచ్చింది. కానీ, 'ఆర్ఎక్స్ 100' రేంజ్ కమర్షియల్ హిట్ రాలేదు. అయినా 'ఈ సినిమా హిట్టవుతుంది. బావుంటుంది' అని నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్న, నన్ను నమ్ముతున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టడానికి 100 శాతం కష్టపడతా. 'రాజా విక్రమార్క'తో మొదలుపెట్టి నేను ఎంపిక చేసుకునే ప్రతి కథ, నేను చేసే ప్రతి సినిమా మిమ్మల్ని దష్టిలో పెట్టుకుని చేస్తా. మీరు గర్వపడేలా చేస్తా. ప్రామిస్ చేస్తా'' అని అన్నారు. ఇదిలా ఉంటే, ఇదే ఈవెంట్లో తనకు కాబోయే భార్య లోహితను హీరో కార్తికేయ పరిచయం చేయటం విశేషం.
నిర్మాత '88' రామారెడ్డి మాట్లాడుతూ, 'సినిమా చూశాం. బాగా వచ్చింది. కార్తికేయ అద్భుతంగా నటించారు. ఆయన సహకారంతో సినిమా సూపర్‌గా వచ్చింది. నా పేరులో '88' ఏంటనేది నాలుగు సినిమాల తర్వాత చెబుతాను'' అని అన్నారు. సమర్పకులు ఆదిరెడ్డి.టి మాట్లాడుతూ, ''పదేళ్లుగా విశాఖ, ఉత్తరాంధ్రలో సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన అనుభవం ఉంది. ప్రొడక్షన్ కూడా చేద్దామని ఈ సినిమా చేశాం. మా ఫ్రెండ్ వినోద్ రెడ్డిగారి ద్వారా కార్తికేయగారు పరిచయం అయ్యారు. 'రాజా విక్రమార్క'ను కార్తికేయ వాళ్ల సొంత ప్రొడక్షన్లో చేద్దామని అనుకున్నారు. మాకు ఓ అవకాశం ఇవ్వమని అడగటంతో ఈ సినిమా నిర్మించే అవకాశం ఇచ్చారు' అని అన్నారు.
దర్శకుడు శ్రీ సరిపల్లి మాట్లాడుతూ, 'మూడేళ్ల క్రితం కార్తికేయతో జర్నీ మొదలైంది. శ్రీ అంటే నేను కాదు. మా టీమంతా! సినిమా నాది అనుకుని మొదలుపెట్టాను. 'మాది' అని వాళ్లంతా జాయిన్ అయ్యారు. 'మన అందరిదీ' అని '88' రామారెడ్డి, ఆదిరెడ్డి ఓన్ చేసుకున్నార. ఈనెల 12న సినిమా రిలీజ్ అవుతోంది. నచ్చితే నేను కనిపించినప్పుడు ఒక షేక్ హ్యాండ్ ఇవ్వండి. సినిమాలో ఎంటర్టైన్మెంట్, థ్రిల్, సిట్చ్యువేషనల్ సాంగ్స్ ఉన్నాయి' అని అన్నారు.