Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర నాయిక అనుష్క తన బర్త్‌డే కానుకగా కొత్త సినిమాని ప్రకటించి అభిమానులతోపాటు అందర్నీ సర్ప్రైజ్ చేసింది. గత కొంత కాలంగా సిల్వర్ స్క్రీన్‌కి దూరంగా ఉన్న అనుష్క సడన్‌గా నయా సినిమాని ఎనౌన్స్ చేయటంతో ఇండిస్టీలోనూ హాట్ టాపిక్ అయ్యింది. అనుష్క పుట్టిన రోజు సందర్భంగా యు.వి.క్రియేషన్స్ సంస్థ ఈ కొత్త సినిమాని అధికారికంగా ప్రకటించింది.
''సాహౌ', 'రాధే శ్యామ్' లాంటి భారీ పాన్ ఇండియా సిినిమాలతో దేశవ్యాప్తంగా యు.వి.క్రియేషన్స్ అద్భుతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. అలాంటి ఈ సంస్థలో అనుష్క హ్యాట్రిక్ సినిమా చేయబోతుండటం విశేషం. ఇది అనుష్కకు 48వ సినిమా. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థలో ఆమె రెండు సినిమాలు చేశారు. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన 'మిర్చి', అలాగే 2018లో లేడీ ఓరియెంటెడ్ 'భాగమతి'లో నటించారు. ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 'భాగమతి' సినిమా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ ఒకేసారి విడుదలై అద్భుతమైన విజయం అందుకుంది. ఇందులో తనదైన నటనతో అందరినీ అనుష్క మెప్పించారు. తాజాగా ఇదే బ్యానర్లో మూడోసారి అనుష్క నటిస్తున్న చిత్రాన్ని మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. న్యూ ఏజ్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను ఆయన తెరకెక్కించబోతున్నారు. త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణ మొదలు కానుంది. ఈ సినిమాలో అనుష్క సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. 'భాగమతి' సినిమా మాదిరిగానే ఈ సినిమాను కూడా అన్ని భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే అన్ని వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.