Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. స్క్రీన్ ప్లే- సంభాషణలు దర్శకుడు, రచయిత 'త్రివిక్రమ్' అందిస్తుండగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాట విడుదలైంది. ఈ పాటను త్రివిక్రమ్ రాయటం విశేషం. 'లాలా భీమ్లా.. అడవి పులి.. గొడవ పడి.. ఒడిసి పట్టు .. దంచి కొట్టు.. కత్తి పట్టు ..అదరగొట్టు..పది పడగల పాము పైన పాదమెట్టిన సామి తోడు, పిడుగులొచ్చి మీద పడితే కొండగొడుగు నెత్తినోడు...'' అంటూ సాగే ఈ పాటలోని పదాలు వింటే, మాటల్లో మాత్రమే కాదు పాటలో సైతం త్రివిక్రమ్ తనదైన శైలిని పలికించారన్నది స్పష్టమవుతుంది. 'భీమ్లా నాయక్'గా పవర్‌స్టార్ పోరాట పటిమను, ఆయన క్యారెక్టర్‌ను ప్రతిబింబించేలా ఉన్న ఈ పాటకు తమన్ సమకూర్చిన స్వరాలు, అరుణ్ కౌండిన్య పాడిన తీరు, రెండు నిమిషాల ముప్ఫై సెకన్లు ఉన్న ఈ పాటలో కనిపిస్తున్న దశ్యాలు.. వెరసి ఆవేశంతో ప్రేక్షకుల్ని ఊగిపోయేలా చేస్తాయి. పక్కా పవర్ఫుల్ మాస్ సాంగ్‌గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి' అని చిత్ర బృందం తెలిపింది.
నిత్యామీనన్, సంయుక్త మీనన్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో రావు రమేష్, మురళీశర్మ, సముద్రఖని, రఘుబాబు, నర్రాశ్రీను, కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి తదితరులు ఇతర ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్, ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్, సంగీతం: తమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పి.డి.వి. ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, దర్శకత్వం: సాగర్.కె.చంద్ర.