Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాన్య దేశారు, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ ముఖ్య పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం 'స్ట్రీట్ లైట్'. మూవీ మాక్స్ బ్యానర్ పై విశ్వ దర్శకత్వంలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ మామిడాల శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగులో ఈనెల 19న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ,' కొన్ని సాంకేతిక కారణాల వల్ల మా చిత్రాన్ని ఈనెల 19న థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా ఒక రాత్రి స్ట్రీట్ లైట్ కింద చీకట్లో జరిగే సంఘటనల సమాహారం. దర్శకుడు ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇది బూతు సినిమా కాదు. ఈ సినిమాలో ఆన్ని రకాల షేడ్స్, ఎమోషన్స్‌తోపాటు మంచి మెసేజ్ ఉంది. కుటుంబ సభ్యులందరూ చూడవలసిన సినిమా ఇది' అని చెప్పారు. 'ఒక రాత్రి స్ట్రీట్ లైట్ కింద విభిన్న వ్యక్తుల వింత పోకడలను సునిశితమైన రీతిలో, వినోదాత్మకంగా చూపించాం. అలాగే ఒక యువతికి జరిగిన అన్యాయానికి ఏ విధంగా ఆమె ప్రతీకారం తీర్చుకుంది అనే రివేంజ్ డ్రామాతో ఈ సినిమాని రూపొందించాం. మంచి మేకింగ్ వ్యాల్యూస్‌తో వైవిధ్యభరితమైన సినిమాను తీసినందుకు సెన్సార్ సభ్యులు అభినందించారు' అని దర్శకుడు తెలిపారు.