Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శివాజీ రాజా తనయుడు విజరు రాజా, తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'వేయి శుభములు కలుగు నీకు..'. రామ్స్ రాథోడ్ దర్శకుడు. జామి లక్ష్మీ ప్రసన్న సమర్పణలో జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకం పై తూము నరసింహా పటేల్, జామి శ్రీనివాస రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని తండ్రీ కొడుకుల మధ్య సాగే 'వేల స్వర్గాలు..' అంటూ సాగే సెంటిమెంట్ సాంగ్‌ను అగ్ర హీరో విశాల్ రిలీజ్ చేేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,' తండ్రీ కొడుకుల మధ్య సాగే 'వేల స్వర్గాలు..' పాట చూశా. చాలా బాగుంది. తండ్రీ కొడుకుల సెంటిమెంట్ అనేది ప్రతి కుటుంబంలో ఉంటుంది. కాబట్టి ఈ సినిమా ప్రతి ఫ్యామిలీకి కనెక్ట్ అవుతుంది. తమ్ముడు విజరు రాజాకి ఈ చిత్రం మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా' అని తెలిపారు. 'నేను చెప్పిన కథని, నన్ను నమ్మిన చిత్ర నిర్మాతలకు థ్యాంక్స్. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పండుగ వాతావరణంలో వస్తున్న మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది' అని దర్శకుడు రామ్స్ రాథోడ్ చెప్పారు. హీరో విజరు రాజా మాట్లాడుతూ, 'దర్శకుడు చాలా కష్టపడి మంచి కంటెంట్‌తో ఈ సినిమాని అద్భుతంగా తీశాడు. ఇంతమంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు' అని చెప్పారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, 'అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేస్తాం' అని అన్నారు.