Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన నూతన చిత్రం 'పుష్పక విమానం'. గీత్ సైని, శాన్వి మేఘన నాయికలు. నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హీరో విజరు దేవరకొండ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్స్, టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలు. ఈనెల 12న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖ గోకుల్ పార్క్‌లో విజరు దేవరకొండ, ఆనంద్ దేవరకొండ ఫ్యాన్స్, స్థానిక సినీ ప్రియుల కేరింతల నడుమ ఆద్యంతం వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా నిర్మాత విజరు మట్టపల్లి మాట్లాడుతూ, 'ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఆనంద్ పర్మార్మెన్స్ మీ అందరికీ నచ్చుతుంది' అని తెలిపారు. ''దొరసాని' చిత్రంతో ఆనంద్ మంచి పేరు, అవార్డ్స్ తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో తనను ఇష్టపడేవారి లిస్ట్ బాగా పెంచుకోబోతున్నాడు. ఈ సినిమాలో సుందర్‌ను మీనాక్షి ఎందుకు వదిలేసిందో చూడాలంటే ఈనెల 12 వరకూ ఆగాల్సిందే. ఇందులో మీనాక్షి క్యారెక్టర్ చేసే అవకాశం రావడం గీత్ అదష్టం. నా క్యారెక్టర్‌కి కూడా మంచి పేరొస్తుందని ఆశిస్తున్నా' అని హీరోయిన్ శాన్వి మేఘన అన్నారు. మరో హీరోయిన్ గీత్ సైని మాట్లాడుతూ, 'ఇందులో మీనాక్షి క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. అందుకే మూడు సార్లు ఆడిషన్స్ ఇచ్చి, ఈ క్యారెక్టర్ దక్కించుకున్నా' అని తెలిపింది.
'సాంకేతికంగా, ఆర్టిస్టుల పర్మార్మెన్స్ పరంగా బలమైన సినిమా. హీరో క్యారెక్టర్‌ను ఎంజారు చేయాలంటే మా చిత్రానికి రండి. ఆనంద్ అంత బాగా నటించాడు. ఈ సినిమా చూశాక విజరు లాగే ఆనంద్కీ లేడీ ఫ్యాన్స్ పెరుగుతారు' అని దర్శకుడు దామోదర అన్నారు.
హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, 'రెగ్యులర్ హీరో క్యారెక్టర్లా ఈ చిత్రంలో నా పాత్ర ఉండదు. సహజంగా మీ చుట్టూ కనిపించే ఒక పాత్ర చిట్టిలంక సుందర్‌ది. మీరు సినిమా స్టార్టింగ్ నుంచి చివరి దాకా దష్టి మరల్చకుండా సినిమా చూస్తారు' అని చెప్పారు.
ఈ సినిమా చాలా బాగుంటుంది. మీరంతా చూడండి. ఆనంద్‌ను చిట్టిలంక సుందర్ క్యారెక్టర్లో ముందు ఊహించలేకపోయాను. కానీ అతను నటించి, చూపించాడు. మీ కోసం మంచి సినిమాలు, కొత్త తరహా చిత్రాలు చేయాలనేది ఒక్కటే నా జీవిత ఆశయం. ఇటీవల మహబూబ్ నగర్లో ఏవిడి మల్టీప్లెక్స్ స్టార్ట్ చేశాం. ఈనెల 11న వేస్తున్న ఈ సినిమా ప్రీమియర్ షోలో కలుద్దాం.
- విజయ్ దేవరకొండ