Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రం 'అఖండ'. తాజాగా ఈ చిత్ర టైటిల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ, 'దీపావళి పండగని పురస్కరించుకుని విడుదల చేసిన టైటిల్ సాంగ్ ప్రోమో అందరినీ ఆకట్టుకుంది. దీనికి అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీని జోష్‌ను పెంచేందుకు టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశాం. తమన్ సంగీత సారధ్యంలో శంకర్ మహదేవన్, ఆయన తనయులు కలిసి పాడిన ఈ పాట ఈ ఏడాది మాస్ ఆంథమ్‌గా నిలవడం ఖాయం. ఈ పాటకు అనంత శ్రీరామ్ అద్బుతమైన సాహిత్యాన్ని అందించారు. ఇందులో అఘోర పాత్రలో బాలయ్య కనిపించిన తీరు, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయంటూ విశేష ప్రశంసలు లభిస్తున్నాయి. అలాగే మెలోడీ ట్రాక్ 'అడిగా..' పాట కూడా మ్యూజిక్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ ట్రాక్ క్షణాల్లో వైరలై సినిమా మీద మరిన్ని అంచనాలను పెంచింది. బాలకష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతోన్న మూడో చిత్రం కావడంతో కూడా ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ మంచి క్యూరియాసిటీ ఉంది' అని చెప్పారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నాయికగా నటిస్తోంది' అని తెలిపారు.