Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్', 'పిట్ట కథలు', 'సైరా నరసింహారెడ్డి', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కథానాయిక శాన్వి మేఘన. ఆమె నటించిన కొత్త సినిమా 'పుష్పక విమానం'.
ఆనంద్ దేవరకొండ హీరోగా దామోదర దర్శకత్వంలో కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్ టైన్మెంట్స్, టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ, విజరు మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలు. ఈనెల 12న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా నాయిక శాన్వి మేఘన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, 'ఈ చిత్రంలో నేను షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ క్యారెక్టర్లో కనిపిస్తాను. చాలా బబ్లీ రోల్ ఇది. ఈ క్యారెక్టర్లో ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటాను. ఈ సినిమాలో హీరో ఆనంద్, గీత్ సైని, నా క్యారెక్టర్స్ ఎక్కడా రెగ్యులర్ హీరో, హీరోయిన్స్ క్యారెక్టర్స్‌లా ఉండవు. కథలో సహజంగా ప్లే అవుతూ ఉంటాయి. ఈ సినిమాలో ఫస్టాప్ చాలా ఫన్‌గా, సెకండాఫ్ ఎమోషనల్‌గా ఉంటుంది. ఆనంద్ క్యారెక్టర్‌తో నా రిలేషన్ ఏంటి అనేది మాటల్లో కంటే తెరపైనే చూడాలి. ఈ సినిమా చూశాక చాలా సంతప్తిగా అనిపించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజరు దేవరకొండ నా గురించి బాగా చెప్పారు. నా నటన బాగుందన్నారు. విజరు ప్రశంసకు అమ్మానాన్నతోపాటు నేనూ హ్యాపీగా ఫీలయ్యా. హీరోయిన్గా ఇలాంటి క్యారెక్టర్లే చేయాలని నియమం పెట్టుకోలేదు. నాకు నచ్చితే నటిస్తాను. ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి, హీరో అల్లు అర్జున్. విజరు దేవరకొండతో నటించే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను. 'పిట్ట కథలు' తర్వాత చాలా వెబ్ సిరీస్ ఆఫర్స్ వచ్చాయి. ప్రస్తుతం రెండు, మూడు కథలు విన్నాను. ఓకే అయ్యాక వాటి వివరాలు చెబుతా' అని తెలిపింది.