Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుదేవా, రెజీనా, అనసూయ, ఆర్యన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'ఫ్లాష్ బ్యాక్'. 'గుర్తుకొస్తున్నాయి' అనేది ట్యాగ్ లైన్. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై పి. రమేష్ పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. డాన్ శ్యాండీ దర్శకుడు. ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎ.ఎన్ బాలాజీ తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు.
గత కొంతకాలంగా రిచ్ లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపిన చిత్రయూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా ఫినిష్ చేస్తోంది. ఇందులో భాగంగా తొలుత అనసూయ డబ్బింగ్ స్టార్ట్ చేశారు.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, 'అన్ని హంగులు జోడించి మునుపెన్నడూ చూడని ఓ అద్భుతమైన కథను తెరపై ఆవిష్కరించబోతున్నాం. పవర్ఫుల్ ఎమోషన్స్‌తో ఉన్న కథకు నేటితరం ఆడియన్స్ కోరుకునే ఆసక్తికర సన్నివేశాలు జోడిస్తూ సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించార. టైటిల్, ట్యాగ్ లైన్ క్రేజీగా పెట్టడంతో సినిమాపై అందరిలోనూ ఆసక్తి రేకెత్తింది. ఈ సినిమాలో చూపించే ప్రతి సన్నివేశం కూడా సగటు ప్రేక్షకుడి మదిలో ఎప్పటికీ నిలిచిపోతుంది. అన్ని వర్గాల ఆడియన్స్ కెనెక్ట్ అయ్యేలా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో రెజీనా ఓ ఆంగ్లో ఇండియన్ టీచర్‌గా విలక్షణ పాత్ర పోషిస్తుండగా, అనసూయ ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఈ ఇద్దరి రోల్స్ సినిమాలో మేజర్ ఎట్రాక్షన్ కానున్నాయి. అనసూయ రోల్ హైలైట్‌గా నిలిస్తే, ప్రభుదేవా క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. శ్యామ్ సిఎస్ అందించిన బాణీలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో అసెట్ అవుతాయి. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ మూవీకి నందు దుర్లపాటి మాటలు రాశారు. సరికొత్త పాయిట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉంది. అతిత్వరలోనే రిలీజ్ డేట్‌ని ఎనౌన్స్ చేస్తాం' అని చెప్పారు.