Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తికేయ గుమ్మకొండ 'రాజా విక్రమార్క'లో ఎన్ఐఏ ఏజెంట్‌గా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి.టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మించిన చిత్రమిది. వి.వి.వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా, తాన్యా రవిచంద్రన్ కథానాయికగా పరిచయమవుతున్నారు. ఈ నెల 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో కార్తికేయ మీడియాతో సంభాషించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
దర్శకుడు శ్రీ సరిపల్లి ఈ కథను నేరేట్ చేసి, పది నిమిషాలు మాట్లాడిన తర్వాత అతను బాగా చేయగలడని నమ్మకం వచ్చింది. అయితే మేకింగ్ మీద పూర్తి ఆధారపడిన సినిమా ఇది. దీన్ని మా దర్శకుడు చాలా బాగా డీల్ చేశాడు.
ఇప్పటివరకూ నేను టచ్ చేయని జోనర్ సినిమా. రెండున్నర గంటలు కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళుతుంది. తర్వాత ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠతో పాటు వినోదం కూడా ఉంటుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉంటాయి. మా '88' రామారెడ్డి, ఆదిరెడ్డిగారితో ఫస్ట్ టైమ్ వర్క్ చేశా. వాళ్లు ఇచ్చిన సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇంత కామెడీ టైమింగ్ ఉన్న క్యారెక్టర్ చేయటం ఇదే తొలిసారి. ఈ క్యారెక్టర్ కోసం బయట నేను ఎలా ఉంటానో అలా నటిస్తే చాలనిపించింది. డైరెక్టర్ కూడా అదే చెప్పాడు. ట్రైలర్ విడుదలయ్యాక కామెడీ టైమింగ్ బావుందని అందరూ అప్రిషియేట్ చేశారు. ఇందులో యాక్షన్ కూడా స్టయిలిష్‌గా ఉంటుంది. ఎన్ఐఏ ఏజెంట్‌గా డ్రస్సింగ్ కూడా క్లాసీగా ఉంటుంది. ఎన్ఐఏ ఏజెంట్ అంటే, బోర్డర్లో జరిగే కథ కాదు. దేశం లోపల జరిగే కథ.
ఇమేజ్, మార్కెట్ అంటూ భవిష్యత్ గురించి ఆలోచిస్తుంటే, తెలియకుండా ఒత్తిడిలోకి వెళ్లి కథలో బేసిక్ పాయింట్స్ మిస్ అవుతున్నా. అందుకే ఓ ప్రేక్షకుడిగా కథలు వినాలని డిసైడ్ అయ్యా. ఈ కథని కూడా అలాగే విన్నా. స్క్రీన్ ప్లే, మేకింగ్, కెమెరా వర్క్, లొకేషన్స్‌లో..మిస్టేక్స్ రిపీట్ కాకుండా చూసుకున్నా.
ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నా కాబోయే శ్రీమతి లోహితకు ప్రపోజ్ చేశా. అయితే ఈ విషయం లోహితకు చెప్పలేదు. ఇన్ని రోజుల నుంచి ప్రేమలో ఉన్నా ఎప్పుడూ ప్రాపర్‌గా ప్రపోజ్ చేయలేదు. ఫోనులో ఇష్టమని చెప్పడం తప్ప, ఐ లవ్యూ అని చెప్పలేదు. పెళ్లి అయిపోతుంది. మళ్లీ అవకాశం రాదని, జీవితాంతం మా ఇద్దరికీ ఓ మెమరీగా, సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఉంటుందని స్టేజ్ మీద ప్రపోజ్ చేశా.
నా బాడీ, ఫిజిక్ వల్లే 'ఆర్ఎక్స్ 100', 'గ్యాంగ్ లీడర్'లో ఛాన్సులు వచ్చాయి. ఇప్పుడు అజిత్‌గారి 'వలిమై'లో కూడా నటించటానికి కారణం కూడా ఇదే. 'వలిమై' కోసం తమిళం కూడా నేర్చుకుని, డబ్బింగ్ చెప్పా. యువి క్రియేషన్స్ సంస్థలో ఒక సినిమా, తర్వాత క్లాక్స్ అని అబ్బాయి డైరెక్ట్ చేస్తున్న సినిమా, శివలెంక కష్ణప్రసాద్ గారి శ్రీదేవి మూవీస్‌లో ఓ సినిమా ఓకే అయ్యింది. 'వలిమై'లో నటించడం వల్ల తమిళంలోనూ మంచి అవకాశాలు వస్తున్నాయి. అన్నీ డిఫరెంట్ జోనర్ సినిమాలే రావటం హ్యాపీ.
మా దర్శకుడు శ్రీ ఫస్ట్ వేరే టైటిల్ చెప్పాడు. ఒక రోజు అతని సెల్లో 'రాజా విక్రమార్క' టైటిల్ చూసి, బావుందని ఫీలయ్యా. ఈ టైటిల్ సౌండింగ్లో ఒక స్ట్రెంగ్త్ ఉంది. ఎంటర్టైనింగ్గా ఉంటుంది. పాజిటివిటీ... చిరంజీవిగారి టైటిల్ పెట్టుకునే ఛాన్స్ ఉంది. దర్శకుడికి చెప్పిన తర్వాత ఒక రోజు టైమ్ తీసుకుని సరే అన్నాడు. ఇదే విషయాన్ని చిరంజీవిగారికి చెబితే 'గుడ్ లక్' అని బ్లెస్ చేశారు. మెగాస్టార్ అభిమానిగా ఆయన టైటిల్‌ని నా సినిమాకి పెట్టుకున్నానని చాలా సంతోషంగా ఉంది.